భీమ్లా నాయక్ తో రాజమౌళి చర్చలు ఫలించలేదు.. ఇంకా ఛాన్స్ ఉందన్న ఆర్ఆర్‌ఆర్ టీమ్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ విడుదల జనవరి 7న కన్ఫర్మ్‌ అయ్యింది.సంక్రాంతి కానుకగా రాబోతున్న జక్కన్న అండ్ టీమ్‌ ఇప్పుడు ఇతర సినిమాల పోటీ వల్ల తల పట్టుకోవాల్సి వస్తుంది.

 Rajamouli Film Rrr Vs Pawan Kalyan Bheemla Nayak,latest Tollywood News-TeluguStop.com

ఆర్ ఆర్ ఆర్ విడుదల ప్రకటనకు ముందే భీమ్లా నాయక్‌.సర్కారు వారి పాట మరియు రాధే శ్యామ్ సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా అధికారికంగా డేట్ లను ఖరారు చేసుకోవడం జరిగింది.

అందుకే వారం ముందుగా సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్‌ వస్తుంది.ఇంత భారీ సినిమా కనుక ఖచ్చితంగా రెండు మూడు వారాలు ఫ్రీ స్పేస్ అవసరం.

అందుకే జక్కన్న స్మూత్ రిలీజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆయన ఖచ్చితంగా భీమ్లా నాయక్‌ తమ సినిమా కోసం తప్పుకుంటుందని ఆశించాడు.

కాని మహేష్ బాబు సర్కారు వారి పాట మాత్రమే సంక్రాంతి బరి నుండి తప్పుకుని సమ్మర్ కు వెళ్లారు.రాధే శ్యామ్‌ మరియు భీమ్లా నాయక్ మాత్రం కంటిన్యూ అవుతున్నట్లుగా ప్రకటించారు.

Telugu Bheemla Nayak, Radeshaym, Rajamouli, Ram Charan-Movie

భీమ్లా నాయక్‌ సినిమా సంక్రాంతికే విడుదల అవ్వబోతున్నట్లుగా మరోసారి చిత్ర యూనిట్‌ సభ్యులు గట్టిగా ప్రకటించడంతో రాజమౌళి టీమ్ కు కాస్త నిరాశ తప్పడం లేదు.ఒకే వారంలో రెండు పెద్ద సినిమాలు ఉంటేనే నష్టం తప్పదు.అలాంటిది మూడు సినిమాలు పెద్దవి ఒకేసారి వస్తే ఖచ్చితంగా మూడు సినిమా లకు నష్టం తప్పదు అంటున్నారు.ఇప్పటికి కూడా తాము భీమ్లా నాయక్ టీమ్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని.

ఖచ్చితంగా వారి నుండి మాకు సానుకూల స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నామంటూ వారు చెబుతున్నారు.టాలీవుడ్‌ జక్కన్న స్వయంగా రంగంలోకి దిగి పవన్‌ కళ్యాణ్ మరియు భీమ్లా నాయక్ చిత్ర నిర్మాతలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

త్రివిక్రమ్‌ ద్వారా ఈ విషయాన్ని డీల్ చేస్తే బాగుంటుందని కొందరు అంటున్నారు.అయితే భీమ్లా నాయక్ సంక్రాంతిని మిస్ చేస్తే ఆ తర్వాత సరైన తేదీ లేదు అందుకే విడుదల తప్పడం లేదు అంటున్నారు.

ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube