వైరల్ అవుతున్న రాహుల్ సిప్లిగంజ్ 'చిచ్చా' టైటిల్ సాంగ్..!

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో  బాగా ఆకట్టుకున్న షో ఏదైనా ఉంది అంటే అందరూ ఇట్లే  చెప్పేస్తారు బిగ్ బాస్ షో అని.మన తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది.

 Rahul Sipliganj Chichha Movie Title Song Viral In Social Media , Rahul Sipligun-TeluguStop.com

ఈ క్రమంలో కొంత మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ లు హీరోలుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ సోహెల్ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

అలాగే బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్  కూడా హీరోగా నటిస్తున్న సినిమాలకు సంబంధించి తగిన చర్చలు కొనసాగిస్తున్నట్లు వార్తల్లో మనం చూసాం.ఇలా ఉండగా తాజాగా బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా టైటిల్ ను ప్రేక్షకులకు తెలపడంతో పాటు , సినిమాకు సంబంధించి టైటిల్ పాటను కూడా విడుదల చేశారు.‘చిచ్చా‘ పేరుతో ఈ సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ, తెలంగాణ యాశతో సాగే ఈ పాటను ప్రేక్షకులకు అందజేశారు.

తెలంగాణ యాస లో ఉండే ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.హీరోగా రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ఈ సినిమా ఆర్.

ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మాలిక్ కందుకూరి దర్శకత్వం వహిస్తున్నారు.ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్  మరియు మోషన్  పోస్టర్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లాంచ్ చేశారు.

అలాగే ఇటీవల కాలంలో రాహుల్ సిప్లిగంజ్ తన ఫ్రెండ్ శ్రీకాంత్ క్రియేట్ చేసిన.ఊకో కాకా మెన్స్ వేర్ బ్రాండ్ స్టోర్ లో కూడా హరీష్ రావే ప్రారంభించిన సంగతి అందరికి విదితమే.

మరోవైపు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో  సింగర్ గాను ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టైటిల్ సాంగ్ ను చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube