పూజా.. మన కాజా.. ఈమె లెగ్గు పెడితే అన్నీ సూపర్ హిట్టే..

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి కి ఎంత ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.

 Producer Dil Raju Superb Words About Pooja Hegde ,thalapathy Vijay , Beast , Dil-TeluguStop.com

ఈయన సినిమా లంటే అక్కడి ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.ఈయన గత సినిమా మాస్టర్ 200 కోట్లు వసూలు చేసి కోలీవుడ్ లో సంచలనం నమోదు చేసింది.

ఇక ఇప్పుడు ఈయన బీస్ట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి రిలీజ్ కు కూడా రెడీగా ఉంచారు.ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించాడు.

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

Telugu Beast, Dil Raju, Kollywood, Pooja Hegde, Rajinikanth-Movie

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుంది.అయితే ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో అందరికి తెలుసు.మరి మరొక నాలుగు రోజుల్లో వీరి ఎదురు చూపులు ఫలించనున్నాయి.

ఇక ఈ సినిమా తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నాడు.రిలీజ్ దగ్గర కావడంతో తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఇందులో విజయ్ మినహా చిత్ర యూనిట్ మొత్తం పాల్గొనాన్రు.

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు పూజా పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఆయన మాట్లాడుతూ. పూజా.

మన కాజా.ఈమె అడుగు పెడితే సినిమా సూపర్ హిట్ అయినట్టే..డీజే.మహర్షి.అల వైకుంఠపురములో.ఇలా వరుస సినిమాలు సూపర్ హిట్టే.ఇక ఇప్పుడు బీస్ట్ కూడా సూపర్ హిట్ అన్నట్టే.ఆమె నెక్స్ట్ ఫిలిం డేట్స్ నాకు కావాలని అడుగు తున్నా.

Telugu Beast, Dil Raju, Kollywood, Pooja Hegde, Rajinikanth-Movie

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పూజా మెల్ల మెల్లగా ఎదుగుతుంది.ఇప్పుడు ఈమె మాములు హీరోయిన్ కాదు.ఆల్ ఇండియా హీరోయిన్.

డాన్సుల పరంగానే కాదు.సినిమా సినిమాకు ఆమె నటన కూడా పెరుగుతూ వస్తుంది.

అంటూ ఈమెపై పొగడ్తలు కురిపించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube