అలా కొట్టి బెడ్‌రూమ్‌లో బంధించేవాడు.. భర్తపై పూనమ్ షాకింగ్ కామెంట్స్!

దేశంలోని సినీ అభిమానులకు పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.పలు వివాదాల ద్వారా పూనమ్ పాండే వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

 Poonam Pandey Comments Goes Viral In Social Media Details Here , Poonam Pandey-TeluguStop.com

బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ నషా మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ప్రస్తుతం పూనమ్ పాండే కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాకప్ అనే రియాలిటీ గేమ్ షోలో కంటెస్టెంట్ గా ఉన్నారు.

Telugu Bollywood, Lockupreality, Luxury, Nasha, Poonam Pandey, Shyam Bombay-Movi

ఈ షోలో తాజాగా పూనమ్ పాండే తన భర్త శ్యామ్ బాంబే వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి కీలక విషయాలను చెప్పుకొచ్చారు. లాకప్ రియాలిటీ షోలో ఉండే జైలులో తనకు నిద్ర, తిండి ఉన్నాయని ఇవి తనకెంతో లగ్జరీ అని ఆమె కామెంట్లు చేశారు.తన భర్తతో కలిసి ఉన్న సమయంలో తాను ప్రశాంతంగా నిద్రపోయేదానిని కాదని పూనమ్ చెప్పుకొచ్చారు.తనను భర్త బెడ్ రూమ్ లో బంధించేవాడని కుక్కను కొట్టినట్టు కొట్టేవాడని ఆమె అన్నారు.

భర్తతో కలిసి ఉన్న సమయంలో వడ పావ్ దొరికితే చాలని తాను అనుకునేదానినని ఆ టైమ్ లో భర్త తిండి కూడా పెట్టేవారు కాదని ఆమె కామెంట్లు చేశారు.భర్త తన ఫోన్ ను పగులగొట్టారని అందువల్ల తాను ఎవరికీ కాల్ చేయడం సాధ్యం కాలేదని ఆమె వెల్లడించారు.

పూనమ్ పాండే చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాను వేధింపులను భరించలేక ఆత్మహత్యాయత్నం చేశానని ఆమె అన్నారు.

Telugu Bollywood, Lockupreality, Luxury, Nasha, Poonam Pandey, Shyam Bombay-Movi

భర్త చేతిలో తాను దెబ్బలు తిన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు.ఆ సమయంలో తన గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారని తగిన శాస్తి జరిగిందంటూ కొందరు అభిప్రాయపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.పూనమ్ చేసిన కామెంట్ల గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube