కృతి శెట్టితో పోల్చితే శ్రీలీల ఇలా అయ్యేంది బాబోయ్‌

సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ లో దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదు.మొదట అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టంగా మారుతుంది.

 Pellisandad Heroine Sree Leela New Movies , Flim News, Krithy Shetty, Pelli Sand-TeluguStop.com

కెరీర్ ఆరంభం లో ఎంతో మంది హీరోయిన్లు ఒక్క అవకాశం కోసం నెలల తరబడి ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి.కొంత మంది హీరోయిన్స్ లక్షా రెండు లక్షల పారితోషికాన్ని కూడా తీసుకుని నటించిన సందర్భాలు ఉన్నాయి.

అలాంటి హీరోయిన్స్‌ విషయం పక్కన పెడితే ఒక్క సినిమా తో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్‌ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.కృతి శెట్టి ప్రస్తుతం టాప్ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే.

ఉప్పెన సినిమా విడుదలకు ముందే కృతి శెట్టి కి రెండు మూడు ఆఫర్లు వచ్చాయి.ఆ తర్వాత ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడం, వంద కోట్ల వసూళ్లు దక్కించుకోవడం ఆమె చేతికి ఐదారు సినిమాలు వచ్చేలా చేసింది.

ఉప్పెన తెచ్చిన క్రేజ్‌ తో ప్రస్తుతం కృతి శెట్టి ఫుల్ బిజీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Krithy Shetty, Pellisandad, Sree Leela-Movie

కృతి శెట్టి తరహాలోనే పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీలా కూడా టాలీవుడ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతుంది అంటూ పెళ్లిసందడి విడుదలైన సమయంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ పెళ్లిసందడి విడుదలై అట్టర్ ప్లాప్ అయింది.దాంతో ఆమె కెరీర్‌ డౌట్‌ లో పడ్డట్లయ్యింది.

సినిమా ప్లాప్‌ అయినా కూడా ఆమెకు అవకాశాలు వస్తాయని ఆ తర్వాత తర్వాత ప్రచారం జరిగింది.అన్నట్లుగానే రెండు మూడు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

కానీ ఆ సినిమాల జాడ ఇప్పుడు కనిపించట్లేదు.అసలు ఈ అమ్మడికి తెలుగు సినిమాల ఆఫర్లు వచ్చాయా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే శ్రీలీలా ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది.కానీ ఆ రెండు మూడు సినిమాలు కూడా ఆమెకు ఎలాంటి గుర్తింపు తెస్తాయి అనేది క్లారిటీ లేదు.

పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్న కూడా హీరోయిన్స్ కొన్నిసార్లు గుర్తింపు రాదు.శ్రీలీలా పరిస్థితి అలాగే ఉంటుందేమో అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తే మరి కొందరు మాత్రం ఒక్క హిట్ పడితే మంచి స్టార్ హీరోయిన్ గా మారే అవకాశం శ్రీలీలా లో ఉందని.

ఆమె కచ్చితంగా ఒక స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుంది అంటూ నెటిజెన్స్ ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube