పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )ఆ పేరే ఒక ప్రభంజనం.సినిమాలతో సంబంధం లేకుండా ఎల్లవేళలా అభిమానులు ఆయన వెంటే ఉంటారు.
పవన్ ఎన్ని సినిమాల్లో నటించాడు.అసలు ఎన్ని హిట్టయ్యాయి.
ఎన్ని ఫ్లాప్ అయ్యాయన్నది ముఖ్యం కాదు.అభిమానులకు ఎంతలా చేరువయ్యారన్నదే ముఖ్యం.
సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్.ఇక రాజకీయ ప్రవేశం చేసినప్పటికీ పవన్ సినిమాల్లోనూ దూకుడుగా ముందుకు వెళుతున్నారు .వరుస సినిమాలతో హోరెత్తిస్తున్నాడు .ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులను చేస్తోన్నపవన్ .ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోన్నాడు.పవన్ కల్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో OG ఒకటి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ తాజాగా బయటకు వచ్చింది.సుజిత్ దర్శకత్వంలో OG అనే సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.ఇందులో ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Mohan ) హీరోయిన్‌గా చేస్తోంది.

అలాగే ప్రకాశ్ రాజ్ (Prakash Raj )ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది .హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబైలో మొదలు పెట్టారు.అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు.అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది .ఇక ఈ మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది.అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం…

ఎలాగైనా అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వినిపిస్తుంది .ఇక.తాజా సమాచారం ప్రకారం.ఈ సినిమా 1950 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందనే విషయం బయటకు వచ్చింది ముంబై నేపథ్యంతోనే సాగుతుందని అంటున్నారు.ఇందిలో పవన్ 60 ఏళ్ల క్రితం నాటి గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడని అంటున్నారు .అంతేకాదు, ఇందులో కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కూడా చేస్తాడని తెలిసింది.ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని సమాచారం .దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి .ఇక ఇప్పుడు బయటకు వచ్చిన సమాచారం ఈ మేరకు వాస్తవం అనేది త్వరలో తెలిసే ఛాన్స్ ఉంది .