పవన్ కళ్యాణ్( Pawan Kalyan )సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా( Bro movie ) ఈ నెల 28న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా రిలీజ్ దగ్గ పడుతున్నా సరే సినిమా యూనిట్ ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు.
పవన్ అయితే పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉన్నడు.బ్రో సినిమా రిలీజ్ ఉందన్న విషయం కూడా మర్చిపోయినట్టు ఉన్నాడు పవన్.
ఇదిలాఉంటే బ్రో మరో హీరో సాయి తేజ్ తో సినిమా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్.అయితే సాయి తేజ్( Sai Dharam Tej ) ఎంత ప్రమోషన్స్ లో పాల్గొన్న బ్రో సినిమాకు హై తీసుకు రాలేకపోతున్నారు.
పవన్ రంగంలోకి దిగితేనే ఫ్యాన్స్ అలర్ట్ అయ్యే అవకాశం ఉంది.బ్రో సినిమా విషయంలో పవన్ మొదటి నుంచి లిమిటెడ్ టైం కేటాయిస్తున్నారు.సినిమాను కూడా కేవలం 20 రోజుల టైం లో పూర్తి చేశారని తెలుస్తుంది.సినిమా నుంచి వచ్చిన మై డియర్ మార్కండేయ, జానవులే సాంగ్స్ నిరశాపరచాయి.మరి సినిమా ఏం చేస్తుందా అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో మొదలైంది.పవన్ డైరెక్ట్ గా ప్రమోషన్స్ లో పాల్గొంటే తప్ప సినిమాకు హైప్ వచ్చే ఛాన్స్ లేదు.
మరి మేకర్స్ పవన్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారో తెలియాల్సి ఉంది.