బెస్ట్ డైట్ ప్లాన్ కావాలంటే ఇపుడు సందర్శించండి చాట్‌జీపీటీని!

మోస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ( ChatGPT ) ప్రపంచపు రూపురేఖలను మార్చేస్తోంది.ఒకప్పుడు డైట్, ట్రావెల్, స్టడీ, ఇతర అంశాలకు సంబంధించిన ప్లాన్స్ కోసం జనాలు ఇంటర్‌నెట్‌లో చాలా సేపు వెతికేవారు.

 For Best Diet Plan Visit Chatgpt Now! Chatgpt, Diet Plan, Technology News, Lates-TeluguStop.com

దాంతో చాలా సమయం వృధా అయ్యేది.అయితే ఇపుడు అలాంటి సమస్య లేదు.

అడ్వాన్స్డ్ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ యూజర్లకు ఆ భారం తగ్గిందనే చెప్పుకోవాలి.మీకు సరిగ్గా ప్రశ్నలు అడగడం రావాలే గానీ చాట్‌జీపీటీ క్షణాల్లో మీరు అడిగినవాటికి సమాధానం అందిస్తుంది.

ముఖ్యంగా డైట్ ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి చాట్‌జీపీటీ ఉత్తమంగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదని అంటున్నాడు ఓ అనుభవజ్ఞుడు.

Telugu Chatgpt, Diet, Latest, Ups-Latest News - Telugu

అవును, ఇపుడు మీరు డైటీషన్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాట్‌జీపీటీ ద్వారా అద్భుతమైన ప్రయోజనాలను పొందొచ్చని “గ్రెగ్ ముషెన్( Greg Mushen)” అనే వ్యక్తి చెబుతున్నాడు.ఆ బాట్ అందించిన డైట్ ప్లాన్‌ను ఫాలో కావడం ద్వారా గ్రెగ్ ఏకంగా 26 పౌండ్లు అంటే 11 కిలోలు వరకు బరువు తగ్గాడని చెప్పుకొస్తున్నాడు.ఇలాంటి మెరుగైన ప్లాన్ కోసం సరైన ప్రాంప్ట్స్‌ అందించాలని గ్రెగ్ తెలిపాడు.

సాధారణంగా ప్రజలు ఆరోగ్యం కోసం, బరువు పెరగడానికి, బరువు తగ్గడానికి, అదేవిధంగా స్ట్రెంత్ పెంచుకోవడానికి, తదితర కారణాలకు డైట్ ప్లాన్ చేసుకుంటారు.వీటిలో దేనికోసం డైట్ ప్లాన్ కావాలనుకుంటున్నారో ఆ విషయాన్ని చాట్‌జీపీటీకి స్పష్టంగా తెలియజేస్తే చాట్‌జీపీటీ ద్వారా సరైన డైట్ చార్ట్ క్రియేట్ అవుతుంది.

Telugu Chatgpt, Diet, Latest, Ups-Latest News - Telugu

అదేవిధంగా బరువు తగ్గడాని( Lose weight)కి ప్రయత్నించేవారు తక్కువ కేలరీలు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండేలా డైట్ ప్లాన్ కోసం చాట్‌జీపీటీని అడగవచ్చు.అయితే చాట్‌జీపీటీని డైట్ ప్లాన్ కోసం అడిగేటప్పుడు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పడం చాలా ముఖ్యం.హైట్‌, వెయిట్, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి గురించి తెలపడం కూడా చాలా అవసరం.తర్వాత వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారా లేదంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావాలనుకుంటున్నారా అనే వివరాలను కూడా ప్రాంప్ట్‌లో రాయాల్సి ఉంటుంది.

కుకింగ్ టైమ్‌ ఎంత ఉండాలనేది తెలపడంతో పాటు సౌత్ ఇండియన్ మీల్‌సా? లేదంటే నార్త్ ఇండియా మీల్‌సా? డైట్ బడ్జెట్ ఎంత లోపు ఉండాలి? వంటి వివరాలను కూడా కూడా అందించిన తరువాత చాట్‌జీపీటీ మీకు ఖచ్చితమైన బెస్ట్ డైట్ ప్లాన్ అందిస్తుంది.గమనిక: అనారోగ్యాలతో బాధపడుతున్నవారు మాత్రం ఆరోగ్య నిపుణులను కలవడం ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube