ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో జీర్ణ సంబంధిత సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యతో బాధపడేవారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అంతేకాకుండా మలబద్ధకం సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.ఇందులో ముఖ్యంగా నీటిని తక్కువగా తాగడం, ఫైబర్ పదార్థాలు ఉండే ఆహారాలను తక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి వాతావరణంలో మార్పులు, ప్రస్తుతం మారిన జీవన విధానం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల మలబద్దక సమస్యలు చాలా మందిలో ఉన్నాయి.
ఈ సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు.అయితే చాలామంది ఉదయం పూట మలవిసర్జన కాకపోతే దాన్ని ఒక రోగంలా కూడా భావిస్తారు.ఇలా జరగడం వల్ల వారిలో ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది.కొంతమంది మలవిసర్జన పూర్తి అయ్యేవరకు ఏ పనిని కూడా చేయకుండా అలానే ఉంటారు.
ఆ రోజంతా వారికి మానసిక ప్రశాంతత అనేది ఉండదు.అలాగే రోజుకు మూడుసార్లు మలవిసర్జన చేయడం అనేది సర్వ సాధారణమే.
మూడు రోజులకు ఒకసారి కూడా కడుపు కాళీ కాకపోతే మలబద్దక సమస్య అని భావించవచ్చు.
ఇంకా చెప్పాలంటే ఈ సమస్యతో బాధపడేవారు నీటిని ఎక్కువగా తాగాలి, తగినంత శరీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.కొందరిలో ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ మలబద్దకం సమస్య ఎప్పుడు తగ్గదు.వారం రోజులకు ఒకసారి ఈ పది రోజులకు ఒకసారి మలవిసర్జన జరుగుతుంది.
అలాంటి వారిలో మలం కట్టిపడడం, దుర్వాసన రావాడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి.అలాంటివారు రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను సేవించడం మంచిది.
దీనివల్ల ఆ తర్వాత రోజు ఉదయం సాఫీగా మలవిసర్జన జరిగి కడుపు అంతా ఖాళీ అయిపోయే లాగా అనిపిస్తుంది.దానితోపాటు రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని కూడా తాగడం మంచిదే.
ఇలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి కొన్ని రోజులలోనే బయటపడవచ్చు.