బుధవారం కృష్ణా జిల్లా పెడనలో( Pedana ) చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మత్స్యకారులకు( Fishermen ) కీలక హామీ ఇచ్చారు.
మత్స్య సంపద పెంచేందుకు కేంద్రం త్వరలో చర్యలు చేపట్టబోతుందని స్పష్టం చేశారు.ఇదే సమయంలో మత్స్యకారుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
జీవో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారుల పొట్ట కొట్టారని విమర్శించారు.కూటమి అధికారంలోకి వస్తే తీర ప్రాంతాలలో జెట్టీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మత్స్యకారులకు ఉపాధి కల్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో పెడన వైసీపీ ఎమ్మెల్యే పై పవన్ సీరియస్ అయ్యారు.పెడనలో ఏ పని జరగాలన్న ఎమ్మెల్యేకు లంచం ఇవ్వాల్సిందేనని మండిపడ్డారు.పెడనలో మట్టి మాఫియా( Sand Mafia ) రెచ్చిపోతుందని.
ప్రశ్నించిన వ్యక్తులను.చెట్టుకు కట్టి మరీ కొట్టారని ఆరోపించారు.
మున్సిపల్ కార్మికులను సైతం ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.కళ్ళంకారి, చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం( Jagan Govt ) బకాయిలు ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న తనపై.మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు.
మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు.వైసీపీ పాలనలో చంద్రబాబు, లోకేష్ పై ఎక్కువ కేసులు పెట్టారు.
ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు.తామ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.