వీడియో వైరల్: పంటపొలంగా మారిన క్రికెట్ స్టేడియం..!

క్రికెట్ స్టేడియం అయినా అంగుళం పొడవుండే పచ్చిక నేలతో అలరారుతూ కనిపిస్తుంది.క్రికెటర్స్ ఎల్లవేళలా స్టేడియంలో ఆడుతుంటారు కాబట్టి స్టేడియమ్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి.

 Pakistan Punjab Province Cricket Stadium Truns Into Crop , Cricket Stadium, Chan-TeluguStop.com

కానీ ఒక స్టేడియం మాత్రం ఏకంగా పంటపొలంగా మారింది.ఆ స్టేడియం మరెక్కడో లేదు మన పొరుగు దేశం పాకిస్తాన్ లోనే ఉంది.

ఈ స్టేడియం చూస్తే పాకిస్తాన్‌ క్రికెటర్లు క్రికెట్ ఆడటమే మానేశారా అనే సందేహం రాకమానదు.

కరోనా వైరస్ వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు పాకిస్తాన్ క్రికెటర్లు.

బయటకు వెళ్లే ధైర్యం కూడా చేయడం లేదు.దాంతో స్టేడియమ్స్ వెలవెలబోతున్నాయి.

పంజాబ్‌ ప్రావిన్స్‌లోని ఖానేవాల్‌ క్రికెట్‌ స్టేడియం (Cricket Stadium) మాత్రం పచ్చి మిర్చి, గుమ్మడికాయల పంటలతో నామ రూపాల్లేకుండా పోయింది.ఈ గడ్డపై ఇప్పుడు కూరగాయల పండించడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడ ఎన్నో ఫారిన్ క్రికెట్ జట్లు ఆడాయి.కానీ ఉగ్రవాదుల దాడుల వల్ల విదేశీయులు పాకిస్తాన్‌కు రావాలంటేనే హడలిపోతున్నారు.

దీంతో పాకిస్తాన్‌లోని క్రికెట్‌ స్టేడియంలు నిరుపయోగంగా మారాయి.

వాటి నిర్వహణ కూడా ఆర్ధిక భారంగా మారడంతో నిర్వాహకులు క్రమేపీ గాలికొదిలేసారు.అలా వదిలేయడం వల్లే ఇప్పుడు స్టేడియంలో స్థానికులు కూరగాయలు పంటలు ఎంచక్కా పండించుకుంటున్నారు.నిజానికి ఈ స్టేడియాన్ని నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు భారీగా డబ్బు ఖర్చు చేసింది.

కానీ ఇప్పుడు అదే స్టేడియం పంటపొలంగా మారడంతో ఆ దేశ క్రికెటర్లు బాధను వ్యక్తం చేస్తున్నారు.ఫాస్ట్‌ బౌలర్‌ షోయాబ్‌ అక్తర్‌ కూడా విచారం వ్యక్తం చేస్తూ.

స్టేడియం దుస్థితిని ట్విట్టర్‌ వేదిక పంచుకున్నారు.క్రికెట్ స్టేడియంను ఏవిధంగా నాశనం చేసారో మీరే వీక్షించండి.

అధికారులారా మీరేం చేస్తున్నారు? అంటూ ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube