ఈ భూ ప్రపంచంలో ఏ విషయం తెలుసుకోవాలన్నా గాని మొదటగా మనం వెతికేది గూగుల్ లోనే.అందుకే గూగుల్ అన్ని దేశాలలో నెంబర్ వన్ స్థానంలో ఉంది.
అయితే ఇప్పుడు గూగుల్ కు రష్యా ఒక జలక్ ఇచ్చిందని చెప్పాలి.అసలు మ్యాటర్ ఏంటంటే.
రష్యాలో అశ్లీల అంశాలు, తీవ్రవాది భావజాల పోస్ట్ లు, డ్రగ్స్ కు సంబంధించిన కంటెంట్ ను నిషేధిత జాబితాలో ఉంచడం జరిగింది.ఆ విషయం తెలిసినగాని గూగుల్ మాత్రం నిషేధిత కంటెంట్ ను డిలీట్ చేయలేదు.
ఆ నిషేదిత కంటెంట్ ఇంకా కనిపిస్తూనే ఉంది.ఈ క్రమంలోనే గూగుల్ కు జరిమానా విధించింది మాస్కో కోర్టు.
జరిమానా కింద 6 మిలియన్ రూబీళ్లను అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.60 లక్షల జరిమానా విధించింది అన్నమాట.మొత్తానికి గూగుల్ పై ఫైన్స్ మారు మోగిపోతున్నాయి.ఈ వారం ప్రారంభంలో గూగుల్ మీద వేరు వేరు అంశాల కింద సుమారు రూ.1.4 కోట్లు జరిమానాలు విధించబడ్డాయి.గత నెలలోనే డేటానిల్వ కేసులో 3 మిలియన్ రూబిళ్లు జరిమానా కట్టింది.మళ్ళీ ఇప్పుడు కూడా జరిమానా కట్టవలిసిన అవసరం వచ్చింది.అంతేకాకుండా రష్యా ఈ మధ్య కాలంలో తీవ్రవాదంపై పోరాటం, ఇతరులను రెచ్చకొట్టే వ్యాఖ్యలపై ఇంటర్నెట్ వినియోగాన్ని నియంత్రణ చేసింది

ఆర్‌ఐఏ నోవోస్టి అనే న్యూస్ ఛానెల్ ప్రకారంకి ఇప్పటివరకు సుమారు రూ.3.2 కోట్ల జరిమానాను విధించినట్లు తెలిపింది.అలాగే రష్యా దేశస్థుల వ్యక్తిగత సమాచారాన్ని రష్యాలోని సర్వర్ లలో మాత్రమే నిల్వ చేయాలనే ఒక కొత్త చట్టం కింద గూగుల్ కి జరిమానా విధించడం ఇదే తొలిసారి.
అలాగే రష్యా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న పోస్ట్ లు తీసేసే క్రమంలో గూగుల్ విఫలం అయిన కారణంగా రష్యన్ అధికారులు గూగుల్ మీద గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనా రష్యా గూగుల్ కి విధించిన జరిమానా నిజంగానే గూగుల్ కి పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.