దారుణం: సిబ్బంది నిర్లక్ష్యం తో అప్పుడే పుట్టిన బిడ్డ చేజారిన వైనం,మృతి

ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రి లో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలను పోగొట్టుకోవలసి వస్తున్న ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నాయి.

 Newborn Slips From Nurse’s Hand And Dies New Born Baby, Doctors, Vanasthalip-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా అప్పుడే పుట్టిన బిడ్డ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చేజారడం తో మృతి చెందిన ఘటన రాచకొండ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది.గత రెండు రోజుల క్రితం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి మీర్ పెట్ కు చెందిన ప్రసన్న (23) డెలివరీ కోసం అని వచ్చింది.

అయితే డెలివరీ కోసం అని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లిన సిబ్బంది అప్పుడే పుట్టిన బాబు ని చేతుల్లోకి తీసుకుంది.అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆ బిడ్డ కింద పడిపోవడం తో తలకి దెబ్బ తగిలినట్లు బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

అయితే హుటాహటిన బిడ్డను నిలోఫర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ బిడ్డ మృతి చెందినట్లు సమాచారం.డెలివరి సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు కిందపడిపోయిందని, అయితే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు శిశువు ఆరోగ్యం బాగోలేదని చెప్పి నీలోఫర్ ఆస్పత్రికి తరలించారని , అయితే అప్పటికే శిశువు చనిపోయింది అని ఆసుపత్రి వర్గాలు చెప్పడం తో అనారోగ్యం తో శిశువు మృతి చెందింది అంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ప్రసన్న బంధువులు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రివద్ద ఆందోళనకు దిగారు.

అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అయితే వనస్థలిపురం ఆసుపత్రి సిబ్బంది మాత్రం ఈ విషయంపై ప్రసన్న బంధువులు ప్రశ్నిస్తుండడం తో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మీ బాబుకి బాగోలేదని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లామంటూ ఆసుపత్రి సిబ్బంది సమాధానం చెబుతున్నారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే ఆ ఆసుపత్రి లో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ కూడా డబ్బుల కోసం చూస్తున్నారు అని అక్కడ చేతివాటం బాగా నడుస్తుందని బంధువులు అంటున్నారు.అయితే అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అప్పుడే పుట్టిన బిడ్డ మృతి చెందాడని మాకు న్యాయం జరిగే వరకు ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తుంటామని ప్రసన్న కుటుంబ సభ్యులు అంటున్నారు.

మరి దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube