విజయ్ దేవరకొండ రియల్ బిహేవియర్ ఇది.. నవీన్ పోలిశెట్టి కామెంట్స్ వైరల్?

ఈ మధ్య కాలంలో టాలెంట్ తో ఎదిగిన నటులలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల సక్సెస్ తో నవీన్ పోలిశెట్టి పేరు మారు మ్రోగుతోంది.

 Naveen Polishetty Shocking Comments About Vijay Devarakonda Real Behavior Detail-TeluguStop.com

నవీన్ పోలిశెట్టి మూడో సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించనున్నారు.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

మదర్ బ్యాంక్ ఉద్యోగి అని కుటుంబ సభ్యులు తన గురించి ఎంతో కేర్ తీసుకునేవారని నవీన్ పోలిశెట్టి అన్నారు.

అయితే తాను జీవితంలో అమ్మానాన్నల దగ్గర డబ్బులు తీసుకోకూడదని ఫిక్స్ అయ్యానని ఎప్పుడైతే డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టానో తాను కంఫర్ట్ జోన్ లోకి వచ్చానని అలా జరిగితే తన హార్డ్ వర్క్ కొంచెం తగ్గుతుందని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు.

అకౌంట్ బ్యాలెన్స్ జీరో ఉంటే డబుల్ ఎఫర్ట్ పెట్టి కెరీర్ కోసం కష్టపడతానని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నారు.జీరో బ్యాలెన్స్ ను పెంచాలని రోజులో 18 గంటలు పని చేస్తానని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు.

అకౌంట్ లో ఒకవేళ 30,000 రూపాయలు పడితే ఆ 18 గంటలలో తాను 10 గంటలు రిలాక్స్ అవుతానని నవీన్ పోలిశెట్టి తెలిపారు.

Telugu Anushka Shetty, Career, Hard, Jathi Ratnalu, Behavior-Movie

విజయ్ దేవరకొండ తనకు ఎంతో మోరల్ సపోర్ట్ చేశారని నవీన్ అన్నారు.టాలెంట్ ఉన్నవాళ్లను విజయ్ ఎంతో సపోర్ట్ చేస్తారని నవీన్ తెలిపారు.అడిషన్ లో బాగా చేస్తున్నావని చెప్పినా తనను ఎంపిక చేసేవాళ్లు కాదని నవీన్ అన్నారు.యాక్టింగ్ ప్రొఫెషన్ నాకు దేవుడితో సమానమని నవీన్ తెలిపారు.

Telugu Anushka Shetty, Career, Hard, Jathi Ratnalu, Behavior-Movie

తను చేసిన ఒక వీడియో 50 మిలియన్ల వ్యూస్ సాధించడంతో మంచి గుర్తింపు వచ్చిందని నవీన్ అన్నారు.అడిషన్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ కాకపోయినా ఆ వీడియోకు వచ్చిన పాజిటివ్ కామెంట్ల వల్ల తాను ఏడ్చానని నవీన్ పోలిశెట్టి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube