నాని, వివేక్ ఆత్రేయ, మైత్రి మూవీ మేకర్స్ 'అంటే సుందరానికీ' థియేట్రికల్ ట్రైలర్ విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’.ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్.

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Theatrical Trailer Lau-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇపుడు విడుదలైన ట్రైలర్ ‘అంటే సుందరానికీ’ చిత్రంపై అంచనాలని భారీగా పెంచింది.

సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప్రేమకథ సరికొత్తగా, మ్యాజికల్ గా అనిపిస్తుంది.ట్రైలర్ లో కనిపించిన ప్రతి పాత్ర నవ్వులు పంచింది.

ట్రైలర్ లో చూపించిన ‘అంటే సుందరానికీ’ కథ నేపధ్యం చాలా ఆసక్తికరంగా వుంది.సుందర్, లీలా వేరు వేరు ప్రపంచాలు.వారి కుటుంబాలు కూడా పూర్తిగా భిన్నం.సుందర్ కి ఒక పెద్ద కల వుంది.

దాన్ని సాధించడానికి వాళ్ళే కుటుంబమే పెద్ద అడ్డంకి, ఇది చాలదన్నట్టు లీల, సుందర్ జీవితంలో వస్తుంది.తర్వాత కథ ఎలాంటి ఆసక్తికరమైన మలుపు తిరిగుందో తెలుసుకోవాలంటే ‘అంటే సుందరానికీ’ చూడాల్సిందే.

ట్రైలర్ లో నాని మార్క్ నటన, టైమింగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి.సాంప్రదాయ బ్రహ్మణ కుర్రాడిగా అద్భుతంగా కనిపించారు.సుందర్ పాత్రలో అమాయకత్వంతో పాటు చాలా వైవిధ్యం వుంది.లీలా పాత్రలో నజ్రియా స్క్రీన్ ప్రజన్స్ అందంగా వుంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్ అడుగడుగునా ఆకట్టుకుంది.రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా కొత్తగా ఆకట్టుకుంది.

ట్రైలర్ చివర్లో వచ్చిన టీవీ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది.సాంకేతికంగా అత్యున్నత స్థాయి పనితీరు కనిపించింది.

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు.వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల కానుంది.ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube