ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ట్రూ కాలర్ వచ్చే కొద్ది వారాల్లో సరికొత్త ఫీచర్లను తీసుకురానుంది.కొత్త ఫీచర్లలో వాయిస్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ కాలింగ్ కోసం వాయిస్ కాల్ లాంచర్, ఎస్ఎంఎస్ ఇన్‌బాక్స్ కోసం పాస్‌కోడ్ లాక్, మెరుగైన కాల్ లాగ్‌లు, సరళీకృత, ఇన్‌స్టంట్ కాల్ రీజన్, వీడియో కాలర్ ఐడీ కోసం ఫేస్ ఫిల్టర్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్మార్ట్ అసిస్టెంట్ ఉన్నాయి.
ఈ లక్షణాలన్నీ వినియోగదారులను సురక్షితమైన, అవాంతరాలు లేని, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ను అందించనున్నాయి.
దీనిపై ట్రూకాలర్ ఇండియా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ రిషిత్ జున్‌జున్‌వాలా స్పందించారు.
తమ యూజర్లకు మెరుగైన సేవలను అందించడానికి తాము ఎల్లప్పుడూ ముందుకు సాగుతున్నామన్నారు.ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం త్వరలో తీసుకురానున్న ఈ ఫీచర్‌లు సమర్థవంతమైన, సురక్షితమైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందిస్తాయన్నారు.
కమ్యూనికేషన్, ముఖ్యమైన డేటాపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండే సామర్థ్యాన్ని ఇస్తాయన్నారు.

వాయిస్ కాల్ లాంచర్: ఇందులో కేవలం ఒక ట్యాప్‌తో, మీరు మీ సన్నిహితులతో కనెక్ట్ అవ్వవచ్చు.ఉచిత, హై డెఫినిషన్‌తో కూడిన వాయిస్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు.ఎస్ఎంఎస్ కోసం పాస్‌కోడ్ లాక్: మీరు మీ టెక్స్ట్ సందేశాలను గోప్యంగా ఉంచుకోవాలనుకుంటే పాస్‌కోడ్ లాక్‌ని ఉపయోగించుకోవచ్చు.మీరు వాడే గాడ్జెట్‌లో ఫింగర్‌ప్రింట్ ద్వారానే ఆ మెసేజ్‌లను చూడగలరు.ఇతరులెవరూ వాటిని చూడడానికి వీలు పడదు.మెరుగైన కాల్ లాగ్‌లు: వ్యాపారాలకు, ఇతర ప్రాథమిక అత్యవసరాలకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.ట్రూ కాలర్ గత వెర్షన్‌లోని వెయ్యి ఎంట్రీలతో పోలిస్తే, 6,400 ఎంట్రీలను ఎనేబుల్, సపోర్ట్ చేసే కాల్ లాగ్‌లను ఆప్టిమైజ్ చేసింది.
ఇంప్రూవ్డ్ కాల్ రీజన్: మీకు వచ్చే కాల్‌ను లిఫ్ట్ చేయడం మీకు సాధ్యం కాకుంటే మీకు ఫోన్ చేసే వారికి మీరు ఓ సందేశాన్ని పంపొచ్చు.ఏదైనా ముఖ్య సందేశమా?, తరువాత కాల్ చేయొచ్చా? వంటి సందేశాలను పంపే వీలుంది.వీడియో కాలర్ ఐడీ కోసం ఫేస్ ఫిల్టర్‌లు: కాలింగ్ అనుభవాన్ని మరింత చక్కగా ఉంచడానికి ఈ ఫీచర్‌ను ట్రూ కాలర్ తీసుకు రానుం







