ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థను మూసివేయడంతో ఎక్కడ జనసాంద్రత అక్కడే ఉండిపోయింది.
దీంతో తాజాగా ఓ మహిళ తన భర్తకు గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కారణంగా దూరంగా ఉండడంతో ఎడబాటు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని గోరంట్ల ప్రాంతానికి చెందినటువంటి ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలసి ఉద్యోగం నిమిత్తమై కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు ప్రాంతంలో నివసించేవారు.
వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించడంతో ముందుగా ఆ వ్యక్తి తన భార్య పిల్లలను తన స్వగ్రామానికి పంపించాడు.
ఆ తర్వాత వ్యక్తి ఎటువంటి రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో తన స్వగ్రామానికి చేరుకోలేకపోయాడు.దీంతో తన భర్త కి దూరంగా ఉండలేక పోయిన వివాహిత తను నివాసముంటున్న ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఇది గమనించిన బాధితురాలిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.భార్య మరణవార్త విన్నటువంటి ఆమె భర్త ఒక్కసారిగా బోరున విలపించాడు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.మరోవైపు భర్త మీద ప్రేమతో ఎడబాటు భరించలేక ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి ఇద్దరి పిల్లల ఆర్తనాదాలు మిన్నంటాయి.