మంచు మోహన్ బాబు కూతురు, నటి, యాంకర్ మంచు లక్ష్మి ప్రస్తుతం కరోనా బారినపడి హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆమెకు టైం పాస్ అవడం కోసం ఎన్నో రకాల మూవీస్, వెబ్ సిరీస్ చూస్తూ కాలక్షేపం చేస్తోంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వీక్షించిన మంచు లక్ష్మి అనంతరం ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచింది.ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ వరుస ట్వీట్లతో ప్రశంసల వర్షం కురిపించింది.
ఇప్పుడే పుష్ప సినిమా చూశాను ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంది.అలాంటి పాత్రలో చేయాలంటే ఎంతో కష్టం.
కానీ ఈ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తర్వాత అల్లు అర్జున్ కి సినిమా మీద ఉన్న ఆసక్తి ఏమిటో తెలుస్తోంది అంటూ అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇక హీరోయిన్ శ్రీవల్లి పాత్రలో రష్మిక ఎంతో అద్భుతంగా నటించిందని, సమంత ఐటం సాంగ్ ఇరగదీసిందని, దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడని లక్ష్మీప్రసన్న సినిమా గురించి అద్భుతమైన రివ్యూ ఇచ్చారు.
పుష్ప సినిమా ఎంతో అద్భుతంగా ఉండడంతో తాను పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు మంచు లక్ష్మి వరుస ట్వీట్లు చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.ప్రస్తుతం పుష్ప సినిమాపై మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.