ఆ కుర్రాడికి అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవాలనే ఆశ.అందరూ తన గురించే మాట్లాడుకోవాలని పరితపిస్తుంటాడు.
అందుకోసం ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్ కోసం అనేక కాస్మొటిక్ సర్జరీలు చేయించుకున్నాడు.ఇప్పుడు ఏకంగా అందమైన బార్బీ బొమ్మలా తనను తయారు చేసుకోవడం కోసం ఏకంగా రూ.10లక్షలు ఖర్చు చేశాడు.
వినడానికి కాస్త వింతగా ఉంది కదా.
కానీ ఇదే నిజం.బ్రిటన్‌కు చెందిన 22 ఏళ్ల జిమ్మీ ఫెదర్‌స్టోన్ అనే వ్యక్తి బార్బీ కెన్ డాల్ అనే బొమ్మ మోడల్ లో కనిపించేందుకు లిప్ ఫిల్లర్లు, చీక్ ఇంప్లాట్లు, బొటాక్స్ లాంటివి ఉపయోగించి, ముఖంలో సర్జరీ చేయించుకున్నాడు.
ఇక్కడ మరో ట్విస్టు ఏంటంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే అని, కెన్ డాల్ లాగా తయారవ్వాలనేదే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు మనోడు.
జిమ్మీ తన 16వ ఏటనే చదువుకు గుడ్ బై చెప్పాడు.
అప్పటి నుంచి డబ్బు కోసం ఎన్నో ఉద్యోగాలు చేశాడు.

అలా ఉద్యోగాల నుంచి సంపాదించిన మొత్తాన్ని కాస్మొటిక్ సర్జరీల కోసమే ఖర్చు చేశావాడంటే నమ్మండి.ప్రస్తుతం తన స్నేహితుడి బోటిక్ దుకాణంలో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు జిమ్మీ.
ఫైనల్ గా కెన్‌డాల్ బొమ్మలాగా కనిపించడమే మనోడి లక్ష్యం.
అందుకోసం రాబోయే కాలంలో తన ముక్కును కూడా మార్చుకుంటున్నాడు.జిమ్మీ ప్రతి వారం తన హెయిర్ స్టైల్ తాను కొత్తగా కట్ చేసుకుంటాడు.
పెదవులు, చీక్ ఫిల్లర్ల కోసం ప్రతి వారం 400 డాలర్లు వరకు ఖర్చు చేస్తూ అందరినీ తనవైపు తిప్పుకుంటున్నాడు.ఫ్యాన్సీ వస్తువలు, అందుకు సంబంధించిన విషయాలపై జిమ్మీకి ఎక్కువ ఆసక్తి.
అందుకే కాన్‌డెల్ బొమ్మలా తనను తాను మలుచుకుంటున్నాడు.రాబోయే రోజుల్లో యూకే రియాల్టీ టీవీ సిరీస్ లో పాల్గొనాలని చెబుతున్నాడు జిమ్మీ.
మరి మనోడి లక్ష్యం నెరవేరుతుందో లేదో చూడాలి.ఎంతైనా ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు కదా.