అది వాడని ఒకేఒక్కడు మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఇంకా ప్రారంభించలేదు.

 Mahesh Babu Not Using Mobile Phone, Mahesh Babu, Sarileru Neekevvaru, Lockdown,-TeluguStop.com

అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా మహేష్ ఇంటికే పరిమితం అయ్యాడు.కాగా మహేష్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేష్ బాబు, ఇప్పటికీ మొబైల్ వాడట్లేదని తెలుస్తోంది.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చాడు.తన ఫోన్ చూసి చాలా రోజులయ్యిందని, తనకు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను తన మేకప్ ఆర్టిస్ట్, మేనేజర్ ఇస్తేనే తాను మాట్లాడతానని తెలిపాడు.తన వరకు ఫోన్ రాకుండా వారు చూసుకుంటారని, ఆఖరిని నమ్రత ఫోన్ వస్తే కూడా వారే ఎక్కువగా అటెండ్ చేస్తారని మహేష్ అన్నాడు.

ఇక సోషల్ మీడియా పోస్టింగ్స్‌ను తాను మొబైల్ ఫోన్ నుండి చేయనని ఆయన తెలిపారు.

అంటే ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా ఫోన్ పట్టుకుని వెళ్లే స్టార్స్ మధ్యలో ఫోన్ లేకుండా తిరిగే వ్యక్తిగా మహేష్ నిలిచాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఏదేమైనా మహేష్ ఈ అలవాటు చాలా మంచిదని, అందరూ ఇలాంటి అలవాట్లను పాటించాలని వారు కోరుతున్నారు.ఇక మహేష్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube