అది వాడని ఒకేఒక్కడు మహేష్

అది వాడని ఒకేఒక్కడు మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు.

అది వాడని ఒకేఒక్కడు మహేష్

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని ఇంకా ప్రారంభించలేదు.అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా మహేష్ ఇంటికే పరిమితం అయ్యాడు.

అది వాడని ఒకేఒక్కడు మహేష్

కాగా మహేష్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేష్ బాబు, ఇప్పటికీ మొబైల్ వాడట్లేదని తెలుస్తోంది.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చాడు.తన ఫోన్ చూసి చాలా రోజులయ్యిందని, తనకు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను తన మేకప్ ఆర్టిస్ట్, మేనేజర్ ఇస్తేనే తాను మాట్లాడతానని తెలిపాడు.

తన వరకు ఫోన్ రాకుండా వారు చూసుకుంటారని, ఆఖరిని నమ్రత ఫోన్ వస్తే కూడా వారే ఎక్కువగా అటెండ్ చేస్తారని మహేష్ అన్నాడు.

ఇక సోషల్ మీడియా పోస్టింగ్స్‌ను తాను మొబైల్ ఫోన్ నుండి చేయనని ఆయన తెలిపారు.

అంటే ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లినా ఫోన్ పట్టుకుని వెళ్లే స్టార్స్ మధ్యలో ఫోన్ లేకుండా తిరిగే వ్యక్తిగా మహేష్ నిలిచాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఏదేమైనా మహేష్ ఈ అలవాటు చాలా మంచిదని, అందరూ ఇలాంటి అలవాట్లను పాటించాలని వారు కోరుతున్నారు.

ఇక మహేష్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

ఆ యాప్స్ ప్రమోట్ చేయాలని 3 కోట్ల ఆఫర్.. శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఆ యాప్స్ ప్రమోట్ చేయాలని 3 కోట్ల ఆఫర్.. శివబాలాజీ సంచలన వ్యాఖ్యలు వైరల్!