మహేష్‌ అన్నా మరీ ఇలా అయ్యావేంటి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్‌

సూపర్ స్టార్‌ మహేష్ బాబు( Mahesh Babu ) లుక్ విషయంలో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొందరు మహేష్ బాబు కొత్త లుక్ ను చూసి పాతికేళ్ల వయసు అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం మరీ సన్నబడ్డాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

 Mahesh Babu And Trivikram Movie Photo Goes Viral,mahesh Babu,trivikram,actor Jay-TeluguStop.com

మొత్తానికి మహేష్ బాబు లుక్ విషయంలో విమర్శలు వస్తున్నాయి.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ప్రస్తుతం త్రివిక్రమ్‌( Trivikram ) దర్శకత్వంలో సినిమా ను మహేష్ బాబు చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా షూటింగ్ స్పాట్ నుండి బయటకు వచ్చిన ఫొటో వైరల్‌ అయ్యింది.మహేష్ బాబు లుక్ కు ఫిదా అవుతున్న వారు ఉన్నారు.విమర్శిస్తున్న వారు ఉన్నారు.లేడీ ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు యొక్క లుక్ కు ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా లో మహేష్ బాబు కు జోడీగా పూజా హెగ్డే( Pooja Hegde ) హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల( Sreeleela ) కూడా ఏమాత్రం తక్కువ కాకుండా హీరోయిన్‌ రోల్‌ ను చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

మహేష్ బాబు గత చిత్రం సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అందుకే ఈ సినిమా పై అంతకు మించి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి.ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు మహేష్ బాబు లుక్ అందరిని మెప్పిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి.ఈ సినిమాలో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ కూడా నటించబోతుందనే ప్రచారం జరుగుతోంది.

అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు.త్రివిక్రమ్‌ సినిమాలో ఇలా కనిపించబోతున్న మహేష్ బాబు తన తదుపరి సినిమా ను రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా లో మహేష్ బాబు ఎలా కనిపిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.జక్కన్న మరియు మహేష్ బాబు కాంబో మూవీని వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube