ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ’em>మహాసముద్రంలో నటిస్తున్నాడు.ఆర్ఎక్స్ 100 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ భూపతి ఇప్పుడు శర్వానంద్ తో మరో విజయాన్ని అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ కూడా విడుదల చేసారు.ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.అక్టోబర్ 14న దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమాలో అతిధి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఒక ఆసక్తికర చర్చ ఇండస్ట్రీలో జరుగుతుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర క్లైమాక్స్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.అజయ్ ఆర్ ఎక్స్ 100 సినిమాలో కూడా మొదట హీరోయిన్ పాజిటివ్ గా అనిపించినా ఆ తర్వాత క్లైమాక్స్ లో మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

హీరోయిన్ ను నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా చూపించి ఫ్యాన్స్ కు ట్విస్ట్ ఇచ్చాడు.ఈ సినిమా హిట్ అవడానికి కూడా హీరోయిన్ పాత్రను చక్కగా మలిచిన తీరు అనే చెప్పవచ్చు.ఇక ఈసారి కూడా మహాసముద్రం లో హీరోయిన్ పాత్ర ప్రత్యేకంగా తీర్చుదిద్దాడట.అదితి రావు పాత్రను ఈ సినిమాలో చాలా స్పెషల్ గా చూస్తారని చిత్ర యూనిట్ అంటుంది.
మరి ఈసారి హీరో హీరోయిన్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయా ;లేదంటే మరేదైనా ట్విస్ట్ ఉంటుందా అని ఇండస్ట్రీలో చర్చించు కుంటున్నారు.