అక్షరాలా 60 లక్షల టిక్కెట్లు..ఈ ఏడాది టాప్ 3 చిత్రాల్లో ఒకటిగా నిల్చిన 'బ్రో ది అవతార్ '!

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ వచ్చిన పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాలను దక్కించుకోలేకపోయాయి.ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాలు బయ్యర్స్ కి భారీ నష్టాలను మిగిలించాయి.రామాయణం ని 400 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో 3 డి టెక్నాలజీ తో విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్‘ చిత్రం ఎంతలా ప్రేక్షకులను నిరాశ పర్చిందో మనమంతా చూసాము.3 డి టెక్నాలజీ తో విడుదల అయ్యింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ సినిమా పెట్టే నష్టాలకు ఇక ప్రభాస్ సినిమాని కొనాలంటే భయపడే రేంజ్ పరిస్థితి ఏర్పడేది.ఇక మరుసటి నెలలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటించిన ‘బ్రో ది అవతా( Bro the Avatar )ర్’ చిత్రం విడుదలైంది.ఈ సినిమాకి కూడా మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది.

 Literally 60 Lakh Tickets 'bro The Avatar' Is One Of The Top 3 Films Of This Yea-TeluguStop.com
Telugu Bro Avatar, Harihara, Og, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movie

అసలు స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన పాటలు,ఫైట్స్,ఎలివేషన్స్ ఇలాంటివి ఏమి లేని ఒక సబ్జెక్టు ని పవన్ కళ్యాణ్ ఎలా ఒప్పుకొని చేసాడు?, టీవీ సీరియల్ బెటర్ ఈ సినిమాకంటే అంటూ సోషల్ మీడియా లో అప్పట్లో కామెంట్స్ వినిపించాయి.కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకి మొదటి వీకెండ్ కళ్ళు చెదిరే ఓపెనింగ్ వచ్చింది.ఫుల్ రన్ లో దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.రీసెంట్ గానే ఈ చిత్రాన్ని జీ తెలుగు( Zee telugu ) లో టెలికాస్ట్ చెయ్యగా కేవలం 7.6 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడలేదు అన్నమాట.

కానీ లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రానికి బుక్ మై షో, పేటీఎం మరియు ఇతర ఆన్లైన్ పోర్టల్ ద్వారా దాదాపుగా 60 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయి అట.

Telugu Bro Avatar, Harihara, Og, Pawan Kalyan, Sai Dharam Tej, Tollywood-Movie

సాధారణంగా ఒక సూపర్ హిట్ సినిమాకి మన టాలీవుడ్ లో కోటి టిక్కెట్లు అమ్ముడుపోతాయి.కానీ బ్రో చిత్రం టాక్ లేకుండా అందులో సగానికి పైగా టికెట్స్ అమ్ముడుపోవడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం.పవన్ కళ్యాణ్ ఆఫ్ బీట్ రీమేక్ సినిమాకి టాక్ లేకుండా ఇంత వసూళ్లు వచ్చాయంటే, ఇక ఆయన కెరీర్ లో భారీ హైప్ తో విడుదల అవ్వబోతున్న ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు‘ లాంటి సినిమాల పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.

ఈ రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే రాజమౌళి రికార్డ్స్ సైతం బద్దలయ్యే ప్రమాదం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube