విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.ఉదయనిధి స్టాలిన్ లియో సినిమాను చూసి ఈ సినిమా రివ్యూను పంచుకున్నారు.
లియో సినిమాకు సంబంధించి ప్రేక్షకుల్లో నెలకొన్న సందేహాలకు సైతం ఆయన చెక్ పెట్టారు.లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్( Lokesh Cinematic Universe ) లో ఈ సినిమా భాగమేనని ఆయన తెలిపారు.
లియో సినిమా సూపర్ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు.సినిమా విజయ్ యాక్టింగ్, యాక్షన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
అన్భరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ, అనిరుధ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
లియో సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని ఉదయనిధి స్టాలిన్( Udayanidhi Stalin ) కామెంట్లు చేశారు.లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఈ సినిమా భాగమేనని ఉదయనిధి స్టాలిన్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఉదయనిధి స్టాలిన్ సినిమా గురించి పూర్తిస్థాయిలో పాజిటివ్ గా చెప్పడం ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది.
లియో సినిమా( Leo Movie )లో ట్విస్టులు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఉదయనిధి స్టాలిన్ లియో సినిమాకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విధంగా ట్వీట్ పెట్టి హాట్ టాపిక్ అయ్యారు.
లియో సినిమాకు స్ట్రెయిట్ సినిమాలతో సమానంగా బుకింగ్స్ జరుగుతుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.ఈ పోటీలో టైగర్ నాగేశ్వరరావు నష్టపోయే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.దసరా సినిమాలు 300 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లు సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.స్టార్ హీరో విజయ్( Hero Vijay ) లియో సినిమాకు ఎదురైన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతుండటం గమనార్హం.