సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో కార్తికేయ ( Karthikeya )ఒకరు.
ఇప్పటికే ఈయన చాలా సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నప్పటికీ అందులో ఎక్కువగా ఫ్లాపులు కూడా ఉన్నాయి.ఇక రీసెంట్ గా వచ్చిన బెదురులంక 2012 ( Bedurulanka 2012 )సినిమా లో ఆయన పోషించిన పాత్ర చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇక దాంతో ప్రస్తుత ఆయన ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అందులో భాగంగానే ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది.అయితే ఈ సినిమా కి డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ స్టార్ డైరెక్టర్ తో మాత్రం ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కార్తికేయ విషయంలో చాలా వార్తలు బయటికి అయితే వస్తున్నాయి.ఇక ఆయన ఇప్పటికే హీరోగా కాకుండా, విలన్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.</br

ఇక ఇప్పటికే తమిళం లో అజిత్ హీరో గా వచ్చిన వలిమై( Valimai ) అనే సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాబట్టి ఇప్పుదు ఆయన పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాడు.ఇక ఇప్పటికే యంగ్ హీరోలైన నిఖిల్ లాంటి హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాలు అందుకున్నారు.ఇక వాళ్ల బాటలోనే కార్తికేయ కూడా నడవబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఏదేమైనా కార్తికేయ ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రస్తుతానికి ఒక సాలిడ్ హీట్ అనేది పడాలి.లేకపోతే ఇండస్ట్రీ లో ఆయన మనుగడ అనేది నడవడం చాలా కష్టం అవుతుంది…ఇక ఆ దిశగానే కార్తికేయ అడుగులు వేస్తున్నట్టు గా తెలుస్తుంది…
.







