యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో కార్తీ ఒకరు.ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.
ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఆవారా సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమా ఇక్కడ మంచి హిట్ సాధించి భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది.కార్తీ సినిమా హిట్ టాక్ వస్తే ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబడుతాయి.
కార్తీ డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసాడు.నాగార్జున తో కలిసి ఊపిరి సినిమా చేసాడు.ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.ఇక ఈ మద్యే విరుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.కార్తీ సర్దార్‘సినిమాను చేస్తున్నాడు.
ఈసారి కూడా కార్తీ ఒక విభిన్న కథతో రాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టీజర్, సాంగ్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి.
ఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రన్ టైం లాక్ అయ్యింది.మొత్తం 2 గంటల 46 నిముషాలుగా లాక్ చేసారు.
ఈ మధ్య కాలంలో ఇది భారీ రన్ టైం అనే చెప్పాలి.అయితే ఇంత భారీ రన్ టైం ను ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయబోతున్నారు.
చూడాలి మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో.