టిడిపి అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ మృతికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు.
చంద్రబాబును బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు.ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నట్లు చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు.
అనాడు వైశ్రాయ్ హోటల్లో 14 మంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ పక్కనే ఉన్నామన్న ఆయన.చంద్రబాబు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవడం తాము చూడలేదని చెప్పారు.ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేసిన వారిలో బాలకృష్ణ కూడా ఉన్నారని ఆయన విమర్శించారు.