కమెడియన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ హైపర్ ఆది(Hyper Aadi) ఒకరు.ఈయన జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో అదిరే అభి టీంలో కమెడియన్ గా పనిచేసే వారు అలాగే స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేసేవారు.
కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది అనంతరం టీం లీడర్ గా మారిపోయారు.ఇక జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
ప్రస్తుతం సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.
ఇకపోతే హైపర్ ఆది వేసే కామెడీ పంచ్ డైలాగ్స్ ఒక్కొక్కసారి హద్దులు మీరుతో ఉంటాయనే విషయం మనకు తెలిసిందే.అలాగే ఈయన తోటి కంటెస్టెంట్లతో చేసే కామెడీ కూడా ఒక్కోసారి శృతిమించుతోంది.ఇలాంటి సమయంలోనే హైపర్ ఆది భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు.
ఇక ఈయన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఢీ (Dhee) కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ప్రసారమైతే ప్రేక్షకులను సందడి చేస్తుంది.
అయితే వచ్చే ఈ బుధవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా హైపర్ ఆది కాస్త ఓవర్ చేశారని తెలుస్తోంది.ఈ ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది ఏకంగా తనకు జోడిగా ఒక అమ్మాయిని తీసుకువచ్చారు.ఆ అమ్మాయిని తన ప్రియురాలు అంటూ హైపర్ ఆది అందరికీ పరిచయం చేశారు.
ఆ అమ్మాయితో హైపర్ ఆది మాట్లాడుతూ ఈ వేదికపై నాకు చాలా అవమానం జరిగింది మన ప్రేమ ఏంటో అందరికీ చాటి చెప్పాలి అంటూ చెబుతారు.దీంతో ఆ అమ్మాయి ఏకంగా వచ్చి హైపర్ ఆది బుగ్గపై ముద్దు పెట్టింది.
ఇలా అందరూ చూస్తుండగానే ఆ అమ్మాయి హైపర్ ఆదికి ముద్దు పెట్టడంతో ఒకసారిగా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారడంతో పలువురు హైపర్ ఆది పై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.