మెగా మేనల్లుడు సాయి తేజ్( Sai Tej ) హీరోగా పవన్ కూడా నటిస్తున్న సినిమా బ్రో.ఈ సినిమా జూలై 28న రిలీజ్ అవుతుంది.
పవన్, సాయి తేజ్ ఇద్దరు కలిసి మెగా పవర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా బ్రో( Bro ) రాబోతుంది.ఈ సినిమాలో సాయి తేజ్ కి జంటగా కెతిక శర్మ నటిస్తుంది.
రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కెతిక ఆ తర్వాత నాగ శౌర్య, వైష్ణవ్ తేజ్ లతో నటించింది.అయితే వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేసిన కెతిక శర్మ ఆ సినిమాతో నిరాశ పరచింది.
అయితే తమ్ముడికి కలిసి రాని ఈ హీరోయిన్ అన్నకి కలిసి వస్తుందా అన్నది చూడాలి.
బ్రో సినిమా మొత్తం పవన్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ సినిమాలో పవన్ రోల్ చాలా తక్కువ ఉంటుందని.సినిమా మొత్తం సాయి తేజ్ మీదే నడుస్తుందని తెలుస్తుంది.విరూపాక్ష( Virupaksha ) సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్ బ్రోతో రెండో హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.
తమిళ సినిమా వినోదయ సీతం రీమేక్ గా వస్తున్న బ్రోని సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు.అయితే సినిమా అనువాదం, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అంతా కూడా త్రివిక్రం చూస్తున్నారు.