అన్ని సరి చూసుకున్నాకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారా ?

తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయిన అంశం మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జాల వ్యవహార అంశం.

మూసాయిపేట, అచ్చంపేటకు చెందిన కొంత మంది రైతులు కేసీఆర్ కు తమ భూములను ఈటెల రాజేందర్ కబ్జా చేసాడని, దయచేసి మా భూములు మాకు ఇప్పించాలని కేసీఆర్ కు లేఖ రాశారు.

అయితే ఈ రైతుల లేఖకు స్పందించిన కేసీఆర్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు.తమ సొంత మీడియాలో కూడా ఈటెలపై చాలా ఘాటుగా వ్యాఖ్యానిస్తూ కథనాలను ప్రసారం చేసింది.

అయితే ఈటెల రాజేందర్ ను టచ్ చేయడమంటే మామూలు విషయం కాదు.కరీంనగర్ జిల్లాలో గత 20 సంవత్సరాలుగా రకరకాల పదవులు అధిరోహించి జిల్లా రాజకీయాలలో కీలక పాత్రను పోషించిన వ్యక్తి ఈటెల రాజేందర్.

అయితే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇంటిలిజెన్స్ తో ఆరా తీసినట్టు తెలుస్తోంది.ఈటెల పై ఇలాంటి నిర్ణయం తీసుకుంటే జిల్లాలో పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుంది, ఏఏ నాయకులు పార్టీని వీడే అవకాశం ఉంది అనే విషయాన్ని ఇంటిలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అయితే ఈటెల వ్యవహారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పెద్దగా పార్టీకి నష్టం ఏమీ ఉండదని, హుజురాబాద్ లో కొంత నష్టం జరుగుతుందని కొంత క్లారిటీ రావడంతో ఈటెల పై విచారణకు ఆదేశించారని తెలుస్తోంది.మరి ఈ భూ వ్యవహారం వివాదం ఎంతవరకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు