బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ మధ్య కాలంలో కంగనా రనౌత్( Kangana Ranaut ) నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు.వివాదాస్పద వ్యాఖ్యల గురించి స్పందించే విషయంలో కంగనా రనౌత్ ముందువరసలో ఉంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తేజస్( Tejas ) అనే క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం గమనార్హం.

ఈ సినిమాలో కంగనా రనౌత్ యుద్ధ విమాన పైలట్ గా కనిపించనుండగా తాజాగా ఢిల్లోలో ఉన్న రామ్ లీలా మైదానంలో రావణ దహనాన్ని నిర్వహించడం జరిగింది.ఈ ప్రోగ్రామ్ కు కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది.ఈ మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
అయితే గతంలో ఒక సందర్భంలో కంగనా స్విమ్ సూట్ తో ఉన్న ఒక ఫోటోను నెటిజన్ షేర్ చేశారు.

ఆ నెటిజన్ ఈమె కంగనానేనా? మోదీ ప్రభుత్వాన్ని ఎంటర్టైన్ చేస్తున్న ఒకే ఒక్క బాలీవుడ్ లేడీ అంటూ పోస్ట్ చేశారు.ఈ ట్వీట్ చూసిన బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం( Subramanian Swamy ) స్వామి స్పందిస్తూ కంగనా కొరకు ఎస్పీజీ సంస్థ కొంచెం ఎక్కువగానే పని చేస్తోందని అన్నారు. రాంలీల మైదానం( RamLeela Maidan )లో చివరి రోజున ఆమెను ఎంపిక చేశారంటే ఎంత మర్యాద ఇస్తున్నారో అర్థమవుతుందని ఆయన తెలిపారు.
ఈ సంస్థ ఒక గౌరవం లేని సంస్థ అని ఆయన చెప్పుకొచ్చారు.ఆ కామెంట్ల గురించి కంగనా స్పందిస్తూ నేను పాలిటిక్స్ లోకి వచ్చేందుకు నా శరీరమే కారణమని అనుకుంటున్నారని వెల్లడించారు.
నా స్విమ్ సూట్ ఫోటో గురించి నీచంగా మాట్లాడారంటే మీ స్వభావం అర్థమవుతోందని ఆమె చెప్పుకొచ్చారు.మహిళల విషయంలో మీ వక్రబుద్ధి స్పష్టంగా తెలుస్తోందని కంగనా వెల్లడించారు.
మహిళలు కేవలం దానికోసమే కాదని ఆమె చెప్పుకొచ్చారు.అదే స్థానంలో ఒక యువకుడు ఉంటే ఇలాంటి మాట్లాడేవారా అని కంగనా ప్రశ్నించారు.