చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) అరెస్ట్ కావడం, ఈ కేసులో టీడీపీకి వ్యతిరేకంగా కీలక పరిమాణాలు చోటు చేసుకుంటూ ఉండటంతో టీడీపీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది.లోకేశ్ ( Lokesh )కూడా త్వరలో అరెస్ట్ కావచ్చని ప్రచారం జరుగుతుండటం టీడీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది.
బ్రాహ్మణి పార్టీ పగ్గాలు చేపట్టినా ఆమెకు ఏపీ పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో అవగాహన రావడానికి చాలా సమయం పడుతోంది.
ఒంటి చేత్తో టీడీపీని గెలిపించే సత్తా ఉన్నది జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కే అంటూ ఏపీలోని పలు గ్రామాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఎలాంటి వివాదాలు లేవు.ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నేర్పరితనం తారక్ కు ఉంది.
తన వాగ్ధాటితో తారక్ ప్రజలను ఫిదా చేయగలరనే సంగతి తెలిసిందే.

తారక్ చంద్రబాబు అరెస్ట్ పై సైలెంట్ గా ఉన్నా అందుకు సంబంధించి వేర్వేరు కారణాలు ఉన్నాయి.బాలయ్య లేదా టీడీపీ( TDP ) పెద్దలు ప్రయత్నిస్తే తారక్ పార్టీలో యాక్టివ్ కావడానికి ఆసక్తి చూపే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాలపై అసక్తి ఉంది.
అయితే కొన్ని అనుభవాల వల్ల.ఎదురైన అవమానాల వల్ల తారక్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు.

సరైన సమయంలో తారక్ రాజకీయాల్లోకి రావాలని భావించడం జరిగింది.జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో పాలిటిక్స్ కు సంబంధించిన సందేహాలకు చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేయనుందో తెలియాల్సి ఉంది.