Jeevitha Rajasekhar : జీవిత రాజశేఖర్ కు కుచ్చు టోపీ పెట్టారుగా.. ఆ ఆఫర్ పేరుతో భారీ మొత్తం స్వాహా?

ఈమధ్య ఆన్లైన్ సేవలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.పైగా అందులో చూపించే ఆఫర్ల ఆశతో వాటికే అలవాటు పడుతున్నారు.

ఏ వస్తువు కొనాలన్నా ముందుగా ఆఫర్లు చూసి కొనడానికి ఇష్టపడుతున్నారు.అయితే కొన్ని కొన్ని సార్లు ఆన్లైన్లో ద్వారా మోసాలు కూడా ఉంటాయి.

అవి ఇప్పటికే చాలాసార్లు బయటపడ్డాయి.ఆఫర్ల పేర్లతో కొందరు కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తూ ఉంటారు.

వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మళ్లీ వారికి జాడ లేకుండా పోతారు.ఇటువంటివి సామాన్యులే కాదు కొన్ని కొన్ని సందర్భాలలో సెలెబ్రెటీలు కూడా ఎదుర్కొంటారు.

Advertisement

అయితే తాజాగా సినీనటి జీవిత రాజశేఖర్ కూడా ఆన్లైన్ కేటుగాడు ద్వారా మోసపోయింది.ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీకి చెందిన నటి జీవిత రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.నటిగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో వ్యక్తిగతంగా కూడా అంతే హాట్ టాపిక్ గా నిలిచింది.

చాలా వరకు ఈమె వ్యక్తిగత విషయాలలో వార్తల్లో నిలుస్తుంది.ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉండగా రాజకీయాలలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

గతంలో టీవీలలో రియాల్టీ షో లలో కూడా చేసింది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా.జీవిత రాజశేఖర్ ఆఫర్ ఆశతో మోసపోయింది.ఇంతకు ఏం జరిగిందంటే.

Advertisement

ఓ మోసగాడు జీవితను టార్గెట్ చేసి తన మేనేజర్ కు బోల్తా కొట్టించాడు.చెన్నైకి చెందిన ఆ మోసగాడు ఇటీవలే జీవితకు ఫోన్ చేసి తన పేరు ఫారుక్ అని అన్నాడట.

అంతేకాకుండా తను మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అంటూ మాట్లాడటంతో.జీవిత తను వేరే పనిలో బిజీగా ఉన్నాను అని చెప్పి ఆ వివరాలు తన మేనేజర్ తో చెప్పమని తెలిపిందట.

దీంతో జీవిత మేనేజర్ తో ఆ మోసగాడు ఈ విధంగా మాట్లాడాడట.ప్రస్తుతం జియో లో ఎలక్ట్రానిక్స్ గూడ్స్ బై బంపర్ ఆఫర్ ఉందంటూ.

దీంతో అతడు జియో కి రిఫర్ చేసి జీవిత వాళ్లకు 50 శాతం డిస్కౌంట్ ఇస్తానని అన్నాడట.ఇక ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అంటూ దానికి సంబంధించిన కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్ లో కూడా వాట్సప్ ద్వారా పంపించాడట ఆ మేనేజర్ కు.

ఇక అందులో రూ.2.5 లక్షల ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.1.25 లక్షలకు మాత్రమే వస్తుందని ఆ మోసగాడు చెప్పటంతో వెంటనే జీవిత మేనేజర్ అతగాడి మాటలను నమ్మి రూ.1.25 లక్షల రూపాయలను మోసగాడు ఎకౌంటుకు ట్రాన్సాక్షన్ చేశాడట.ఆ తర్వాత ఆ మేనేజర్ ఆ మోసగాడికి ఫోన్ చేయడంతో ఎటువంటి స్పందన లేకపోగా వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా.ఆ మోసగాడు చెన్నైకి చెందిన టి నాగేంద్రబాబు అని.ఇతడు గతంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేసి చాలా మోసాలు చేశాడు అని పోలీసులు తెలిపారు.ఇక ప్రస్తుతం అతడు పోలీసులు అదుపులో ఉన్నాడు.

తాజా వార్తలు