కరోనాతో మరి కొంతకాలం సహజీవనం చేయాల్సి ఉంటుందని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన దగ్గర నుంచి ఆయనపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది.బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న జగన్ ఒక సాధారణ జ్వరం తో పోల్చడం, విపక్షాలు ఆయనపై పెద్ద ఎత్తున మండిపడుతూ రాద్ధాంతం చేస్తున్నారు.
ఇక టిడిపి అనుకూల సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున జగన్ పై వ్యతిరేక కథనాలు నడుస్తున్నాయి.వాస్తవంగా చూసుకుంటే జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్దగా తప్పు పట్టడానికి ఏమీ లేదు.
ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు మిగతా అన్ని అగ్రరాజ్యాలు, వైద్యరంగం నిపుణులు ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.ఇక ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మాస్కులు మన జీవితంలో ఒక భాగం కానున్నాయి అంటూ వ్యాఖ్యానించారు.
అయితే మిగతావారు ఇదే విషయాన్ని చెప్పినా ఏపీలో ప్రతిపక్షాలు మాత్రం జగన్ చెప్పిన ఈ విషయాన్ని తప్పుబడుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు సమర్థిస్తూ జనసేన మాజీ నాయకులు, సి.బి.ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్పందించారు.మన ఇంట్లో పిల్లాడికి ఒంట్లో బాగోలేదు వాడిని ఓదార్చడం కోసం జ్వరం లే నయయనా తగ్గిపోతుందని ఒక తండ్రిగా చెబుతాం అంటూ జెడి లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.రోగం పెద్దదైన పిల్లాడిలో ధైర్యం నింపేందుకు చేసిన ప్రయత్నం ఇది.అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ చేసిన వ్యాఖ్యలు తప్పు పట్టడానికి ఏమీ లేదని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.అయితే ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టిన సంగతి తెలిసిందే.పవన్ తీవ్ర స్థాయిలో జగన్ పై విమర్శలు చేశారు.ఇప్పుడు అదే పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన లక్ష్మీనారాయణ జగన్ కు అనుకూలంగా మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గతంలో జగన్ అక్రమాస్తుల కేసులో లక్ష్మీనారాయణ విచారణాధికారిగా ఉండి ఆయనను నిరూపించేందుకు శతవిధాల ప్రయత్నించారు.

ప్రస్తుతం ఆ కేసులో జగన్ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.ఇక ఇప్పుడు లక్ష్మీనారాయణ రాజకీయ నాయకుడిగా ఉండడంతో ఆయన తన ఉనికిని చాటుకోవాలి అంటే తప్పనిసరిగా ఏదో ఒక పార్టీలో చేరాల్సి ఉంది.రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వెంటనే ఆయన జనసేనలో చేరి సరిదిద్దుకోలేని తప్పు చేశాననే భావనలో ఎక్కువగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన బిజెపిలో చేరబోతున్నారనే వార్తలు వచ్చినా ఆయన మౌనంగా వుండిపోయారు.ప్రస్తుతం జగన్ కు దగ్గరయ్యేందుకు జేడీ ప్రయత్నిస్తున్నారని దానిలో భాగంగా మెల్లిమెల్లిగా జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ ఆ పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.