భరతమాత రక్షణ బాధ్యతను సగర్వంగా మోయడానికి ఆర్మీలో చేరాడు శివ గంగాధర్ అనే 28 సంవత్సరాల యువకుడు.ఆ వృత్తినే దైవంగా భావిస్తూ విధినిర్వహణలో అసువులు బాసాడు.
ఆ వివరాలు తెలుసుకుంటే.కశ్మీర్‌లోని లద్దాఖ్ జిల్లా లైలాలో ఆర్మీ వాహనం బోల్తా పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఇకపోతే కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలగుంట్లకు గ్రామానికి చెందిన శివ గంగాధర్ అనే యువకుడు 2017లో ఆర్మీలో చేరారు.ఈ క్రమంలో లద్దాఖ్ జిల్లాలోని లేలా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు.
కాగా శుక్రవారం విధి నిర్వహణలో ఉన్న శివగంగాధర్ ప్రమాదవశాత్తు లోయలో పడి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు సైనికాధికారుల పంపిన సమాచారం అందింది.

అయితే ఈ సైనికుని భౌతికకాయం ఆదివారం స్వగ్రామానికి చేరే అవకాశం ఉందట.ఇకపోతే శివగంగాధర్ కు గతేడాది నవంబర్ లో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోముదేవులపల్లి గ్రామానికి చెందిన రాధికతో వివాహం జరిగిందట.ఇలా పెళ్లైన మూడు నెలలకే శివగంగాధర్ మరణించడంతో గ్రామంలో కూడా విషాద చాయలు అలుముకున్నాయట.