ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన (Janasena) ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుంది.ఇందులో భాగంగా జోనల్ కమిటీలపై జనసేన దృష్టి సారించింది.
ఈ మేరకు జోనల్ కమిటీ(Zonal Committee) లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సమావేశం నిర్వహించనున్నారు.జనసేన పార్టీ కార్యాలయం(Janasena Party Office) లో ఈ మీటింగ్ జరగనుండగా ఎన్నికల ప్రచార విధివిధానాలపై నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారని తెలుస్తోంది.
కాగా రానున్న ఎన్నికల కోసం పార్టీ అధిష్టానం జోనల్ కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే.ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ఒకటి.అలాగే రాయలసీమ రెండు జోన్లుగా పార్టీ కమిటీలు వేసింది.జోనల్ కమిటీలకు కన్వీనర్లు, సభ్యులను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.