ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి( AP CM Jaganmohan Reddy ) మళ్ళీ అదే పాతపాట పడుతున్నారు.ఎప్పుడు చెప్పే సింహం తోడేళ్ళ కథనే ప్రతి బహిరంగ సభలోనూ వినిపిస్తున్నారు.
దీంతో ఈ సింహం తోడేళ్ళ కథ మినహా ప్రజలకు చెప్పడానికి ఇంకా వేరే టాపిక్ లేదా అని సిఎం జగన్ వైఖరి పట్ల విమర్శలు గుప్పించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉంది.
ఒకవైపు 175 స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా ఏపీ సిఎం.మరొకసారి అధికారమిస్తే ఇంకా ఏమేమి చేయగలమో చెప్పాల్సింది పోయి ప్రతి బహిరంగ సభలోనూ విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని, తాను మాత్రం సింగిల్ గానే వస్తానని తనకు దేవుడి అండ ప్రజల ఆశీస్సులు ఉన్నాయని.
ఇలా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారే తప్పా ఇంకా వేరే విషయాలను చర్చించడమే లేదు.

ఇక తాజాగా చిలకలూరిపేటలో( Chilakaluripet ) నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రాంలో కూడా ప్రధానంగా ఇవే వ్యాఖ్యలు చేశారు.తనను తాను సింహంతో పోల్చుకుంటూ ప్రత్యర్థి పార్టీల నేతలను తోడేళ్లతో పోల్చుకుంటూ అవే పాత మాటలను వినిపిస్తున్నారు.దీంతో ప్రజలు కూడా విసుగుచెందే పరిస్థితి ఏర్పడింది.
రాజకీయాల్లో వ్యూహాలు ఉండడం సహజం.ఒకరిపై ఒకరుపై చేయి సాధించాలంటే సరైన వ్యూహరచన ఎంతో అవసరం.
వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ ను గద్దె దించేందుకు టీడీపీ, జనసేన కలిసి వ్యూహరచన చేసే అవకాశం ఉంది.

అయితే అధికారంలో ఉన్న జగన్ తన ప్రసంగాల్లో ప్రతిపక్షాల వ్యూహాలను వల్లించాల్సిన అవసరం లేదనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నందున ఇప్పుడు జరుగుతున్నా అభివృద్దిని చెబుతూ వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపిస్తే.ఇంతకు మించి అనేలా అభివృద్ది చేసి చూపిస్తామనే హామీలను జగన్ ఇస్తే బాగుంటుందనేది రాజకీయ వాదుల నుంచి వినిపిస్తున్న మాట.నిజంగానే ప్రజా మద్దతు తనవైపే ఉందనే దైర్యం జగన్ కు ఉన్నప్పుడూ ప్రతిపక్షాల వ్యూహాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే విమర్శ కూడా వినిపిస్తోంది.జగన్ కు ఓటమి భయం కారణంగానే పదే పదే సింహం తోడేళ్ళ కథ వినిపిస్తున్నారని మరికొందరు అంటున్నారు.
మొత్తానికి సిఎం జగన్ కేవలం ప్రతిపక్షలను ఎదుర్కోవడం పైనే దృష్టి పెడితే.ప్రజా మద్దతు దూరమయ్యే అవకాశం ఉంది.మరి సిఎం జగన్ ఈ సింహం తోడేళ్ళ కథ ఇంకెన్నాళ్ళు వల్లిస్తారో చూడాలి.