ఇటీవల జరిగిన ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత నాయకులతో జగన్( Jagan ) భేటి అవుతున్నారు.గురువారం వైసీపీ పార్టీ ఎమ్మెల్సీలతో భేటీ కావటం జరిగింది.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్డీయేలో చక్రం తిప్పే అవకాశం ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా చంద్రబాబుని క్షమించడు.
రాబోయే రోజుల్లో మన కార్యకర్తలని ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో వారి గ్రామాలకు వెళ్లి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి తోడుగా ఉండే కార్యక్రమాలు జరుగుతాయి.ఏకంగా 14నెలలు పాదయాత్ర చేశాను.
ఆ వయసు ఇప్పటికీ నాకు ఉంది.
ఆ సత్తువ ఈరోజుకి నాకు అలానే ఉంది.గతంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పుడు మనం ఏ మాదిరిగా పైకి లేచామో కూడా మీ అందరికీ తెలుసు.గడపగడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది.
ఇవన్నీ ఉన్నప్పుడు మనం పైకి లేవడం తథ్యం.కేవలం వారికి ఓటు వేయలేదనే ఒకే ఒక్క కారణంతో కొడుతున్నారు, అవమానిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు.
ఇవన్నీ కూడా శిశుపాలుడి పాపాల్లో భాగంగా అప్పుడే మొదలయ్యాయి.అదేవిధంగా ఫలితాలు గురించి మాట్లాడుతూ.
జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు ఈ ఫలితాలను చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం దేశ చరిత్రలో కానీ, రాష్ట్ర చరిత్రలో కానీ ఈ మాదిరిగా ఎప్పుడూ జరగలేదు.ఏకంగా 2లక్షల 70వేల కోట్లు ఎటువంటి వివక్ష, లంచాలు లేకుండా ఏ నెలలో ఏమిస్తామో చెప్పి క్యాలెండర్ ప్రకటించి మరీ అది తప్పకుండా పాటిస్తూ అమలయ్యేలా చేశాము".
అని వ్యాఖ్యానించారు.