తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని( Ram Pothineni )…ప్రస్తుతం ఈయన చాలా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక అందులో భాగంగానే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో కూడా ఆయన మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి స్టార్ డైరెక్టర్లతో వరుస సినిమాలను చేస్తున్నాడు.
ఇక ఇంతకుముందే బోయపాటి శ్రీను డైరెక్షన్ లో స్కంద అనే సినిమా చేసి ఫ్లాప్ ని మూట గట్టుకున్న రామ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్( Double iSmart ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది.
కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ ని కొట్టాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఒక పవర్ ఫుల్ కంబ్యాక్ ని ఇవ్వాలని రామ్ పోతినేని భావిస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే రామ్ తో సినిమా చేయడానికి తెలుగు స్టార్ డైరెక్టర్ అయిన పరుశురాం( Parasuram,) ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గా పరిష్కారం ఆయన చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమాతో భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు.
అయినప్పటికీ తను ఎక్కడ తగ్గకుండా ఇప్పుడు రామ్ తో సినిమా చేసి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక అందుకు తగ్గట్టుగానే ఆయన ఒక లైన్ ని రామ్ కి చెప్పినట్టుగా తెలుస్తుంది.
ఇక దానికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.మరి వీళ్ళ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎలాంటి జానర్ కి సంబంధించింది అనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి… మరి ఈ సినిమాతో అయిన రామ్ పోతినేని సరైన సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.