ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల ప్రచారం వేడెక్కింది.జనాలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇస్తూ వారి మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇలా ముఖ్య నేతలు అంతా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు.అయితే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ( Nara Lokesh )తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గానికే ఇప్పటి వరకు పరిమితం అయ్యారు.
రాష్ట్రవ్యాప్త పర్యటనకు ఆయన అంతగా ఆసక్తి చూపించలేదు.అయితే దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తం అయ్యాయి.
లోకేష్ కు మంగళగిరిలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ నియోజకవర్గం వదిలి బయటకు రావడంలేదనే విమర్శలు తీవ్రం కావడం, తదితర పరిణామాల నేపథ్యంలో లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు.
టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP) కూటమి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.ఈనెల 13న ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.లోకేష్ కొన్ని కీలక నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు నిర్వహించాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.ఈ మేరకు యువ ఓటర్లే లక్ష్యంగా లోకేష్ సభలు నిర్వహించనున్నారు ఈ మేరకు ఈనెల 30 తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు వరకు యువతతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
అలా వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు.మంగళవారం ఒంగోలు( Ongole)లో యువతతో లోకేష్ భేటీ కానున్నారు.మే 1న నెల్లూరు, మే 2న రాజంపేట, మే 3న కర్నూలు, మే నాలుగు నంద్యాల, మే 5న చిత్తూరు, 6 ఏలూరులో లోకేష్ సభలను నిర్వహించనున్నారు.