రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) మండలం రాచర్ల బోప్పాపూర్ గ్రామంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడేలయ్యా కళ్యాణోత్సవం ఆదివారం కన్నుల పండుగ గా జరిగింది.రజక సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఇంటింటి కి బోనమెత్తారు.
వారి.వారి ఇంటి నుంచి గ్రామ దేవత పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు తీశారు.
అక్కడి నుంచి శ్రీ మడేలయ్యా ఆలయం( Sri Madelayya temple ) వరకు ఊరేగింపు తీశారు.అనంతరం ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కళ్యాణోత్సవం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ గౌస్ బాయి, బండారి బాల్ రెడ్డి రజక సంఘం ప్రతినిధులు మహిళలు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.మడేలయ్యా కృపకు పాత్రులయ్యారు.