ప్రజలకి ఇచ్చిన ప్రతి హామీ నేరవేరుస్తాం - ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజాలకి ఇచ్చిన ప్రతి హామీ నేరవేరుస్తాం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.శనివారం వేములవాడ అర్బన్ మండలం చింతల్ తాన, అరెపల్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు.

 Will Fulfill Every Promise Given To People Mla Adi Srinivas, Mla Adi Srinivas,-TeluguStop.com

వేములవాడ ఎమ్మెల్యే గా ఎన్నికై మొదటిసారి గ్రామానికి విచ్చేసిన ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన గ్రామాల ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ముంపు గ్రామాల సమస్యలు అన్ని ఇన్ని కాదు అని ప్రతి గ్రామం సమస్యల మయంగా ఉన్నాయని అన్నారు.

గతoలో ముంపు గ్రామాల సమస్యలపై పోరాటం చేసిన వాడిగా ఇక్కడి సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్నవాడిగా తప్పకుండా ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానన్నారు.

ముంపు గ్రామాల సమస్యలు నాతోపాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కూడా తెలుసని వారు కూడా మనతోపాటు ఆందోళనలో పాల్గొన్నారని గుర్తు చేశారు.మీ దయతో ఎన్నికల్లో గెలిచానని,ఈ పదవి ప్రజలకు అంకితం చేస్తున్నానని అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట గా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిందని తెలిపారు.రాజీవ్ ఆరోగ్య శ్రీపథకం కింద 10 లక్షల వరకు అమలు చేసమని అన్నారు.

నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube