సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దు అని,ఆధునిక సాంకేతిక కాలంలో అందుబాటులోకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు పరికరాల వల్ల సైబర్ నేరాల శాతం పెరుగుతొందని,వివిధ రకాల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరికరాలు ఉపయోగించక తప్పదని,కానీ అదే సమయంలొ ప్రజలు సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి వుండాలి అని పేర్కొన్నారు.

 Rajanna Sircilla District Sp Akhil Mahajan Creating Awareness On Cyber Crimes, R-TeluguStop.com

సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.

నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం మరియు నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ మొదలగు వంటి వాటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు…

రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈవారం రోజులలో నమోదు అయిన కొన్ని సైబర్ కేసుల వివరాలు.


1.బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఫేక్ వెబ్ సైట్ నౌకరీ డాట్కామ్ లో వివరాలు అప్లోడ్ చేశాడు.బాధితునికి గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ చేసి ఎచ్ పి కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాము మీరు సెలెక్ట్ అయ్యారని రిజిస్ట్రేషన్ ఫీజు అని చెల్లించలని చెప్పడంతో బాధితుడు అది నిజమని నమ్మి 13,000/-రూపాయలు చెల్లించి మోసపోతాడు.

2.ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు డీటీడీసీ కొరియర్ కి సంబంధించిన కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేశాడు.అది ఫేక్ నెంబర్ సైబర్ నేరస్థుడు ఒక లింక్ బాధితునికి పంపించి ఐదు రూపాయలు పేమెంట్ చేయమని చెప్పాడు.

బాధితుడు ఆ లింకు ద్వారా ఐదు రూపాయలు పేమెంట్ చేశాడు.తద్వారా బ్యాంకుకు సంబంధించిన వివరాలు సైబర్ నేరస్తుడికి చేరడంతో 85,000/- వేల రూపాయలు మోసపోతాడు.

3.సిరిసిల్ల టౌన్ పరిధిలో బాధితుడు టెలిగ్రామ్ యాప్ లో వన్ ప్లస్ మొబైల్ కి సంబంధించి ఒక ఆడ్ చూశాడు.ఆ ఫోన్ ని ఆఫర్ ద్వారా పొందవచ్చని అడ్వాన్స్ ,టాక్సెస్ చెల్లించమని బాధితుని వద్ద నుండి పలు దఫాలుగా 80,000/- వేల రూపాయలు సైబర్ నేరస్తుడు పేటీఎం ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.

4.తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు తను ఆర్డర్ చేసిన వస్తువు యొక్క వివరాలు తెలుసుకోవడానికి అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేశాడు.అది సైబర్ నేరస్తునికి కనెక్ట్ అయ్యింది.

సైబర్ నేరస్తుడు బాధితుని ఫోన్లో స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా క్రెడిన్షియల్స్ తీసుకున్నాడు.తద్వారా 15,000/- రూపాయలు మోసపోతాడు.

5.వేములవాడ టౌన్ పరిధిలో బాధితునికి ఇంస్టాగ్రామ్ లో గుర్తు తెలియని వ్యక్తి నుండి ఒక ఎస్ఎంఎస్,లింక్ వచ్చింది.లింకు క్లిక్ చేస్తే టెలిగ్రామ్ కి కనెక్ట్ అయ్యింది.సైబర్ నేరస్థుడు టెలిగ్రామ్ లో చాట్ చేస్తూ కొంత అమౌంట్ పే చేస్తే ఒక టాస్క్ ఇచ్చాడు దానికి బాధితునికి ఎక్కువ మొత్తంలో అమౌంట్ వచ్చింది.

ఇలా టాస్కులు పెంచుకుంటూ వెళ్ళాడు డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని గుర్తించాడు.బాధితుడు 5500/- రూపాయలు నష్టపోతాడు.

తీసుకోవలసిన జాగ్రత్తలు:-

• మీకు లాటరి,లోన్ వచ్చిందని, కాల్ గాని మెసేజ్ గాని వచ్చిందా ?.ఆశపడకండి, అనుమానించండి.వెంటనే 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి.
• అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యకండి, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, మీకు చేసిన వీడియో కాల్ రికార్డు చేసి,మిమ్మల్ని బెదిరించి డబ్బులు లాగేస్తారు.
• వేలల్లో పెట్టుబడి లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మకండి.
• తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారు.

ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చెయ్యండి.
• మీకు ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు అంటే వాళ్ళు సైబర్ మోసగాళ్ళు అని గ్రహించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube