నందమూరి కుటుంబంలో హరికృష్ణ( Harikrishna ) గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన హీరోగా చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఆయన కుమారులుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్, కళ్యాణ్ రామ్( NTR, Kalyan Ram ) లు ఇండస్ట్రీ లో మంచి హీరోలు గా గుర్తింపు పొంది ప్రస్తుతం టాప్ హీరోలుగా వెలుగొందుతున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే,అయితే హరికృష్ణ పెద్ద కొడుకు గురించి ఎవరికి పెద్దగా తెలీదు ఎందుకంటే ఆయన సినిమాల్లో నటించలేదు ఇదంతా బాగానే ఉంది కానీ ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన రోడ్ ప్రమాదం లో జానకి రామ్ మరణించారు… జానికి రామ్( Janiki Ram ) మరణించే సమయానికే ఆయనకి భార్య దీపికా( Deepika ) తోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇలా రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ మరణించడంతో దీపిక తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతున్నారు.అయితే తాజాగా దీపిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీపిక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సలహా సూచన మేరకు ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వినపడుతున్నాయి…పెళ్లి అనేది తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బలవంతం మేరకు ఆమె కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది.
అయితే నందమూరి హరికృష్ణ పెద్ద కోడలుగా పెళ్లి అయినప్పటి నుంచి దీపికా వాళ్ళ ఇంట్లో చాలా బాధ్యతలని నిర్వర్తిస్తూ వచ్చింది.జానకి రామ్ మరణం తో ఒంటరి గా ఉంటున్న ఆమెని చూడలేక పోతున్నారట నందమూరి కుటుంబము కూడా,అయితే ఆమె పెళ్లి ప్రస్తావన ఇంకా నందమూరి ఇంట్లో వినిపించిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది…