గోరంట్ల న్యూడ్ వీడియోపై రాద్దాంత‌మా..? మ‌రి ఓటుకు నోటు కేసు సంగ‌తేంటి అంటున్న ఆ నేత‌..!

రాజ‌కీయాల్లో తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం.అయితే అధికార పార్టీ అయినా.

 Is It Enough To Write On Gorantla's Nude Video? And What About The Case Of Notes-TeluguStop.com

ప్ర‌తిప‌క్షాలు అయినా ఓ బ‌ల‌మైనా ఆరోప‌ణ‌తో ప్ర‌జ‌ల‌కి వినిపిస్తూ ఎన్నిక‌ల‌ల్లో ల‌బ్ది పొందుతుంటారు.అవ‌స‌రం ఏర్ప‌డిన‌ప్పుడ‌ల్లా వాడుతుంటారు.

అయితే అందులో నిజం ఉం.ఒట్టి ఆరోప‌ణేనా.అని నిజ నిర్దార‌ణ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోరు.కానీ ఒకిరిమీద మ‌రొక‌రు బుర‌ద‌జ‌ల్లుకుంటారు.ప్ర‌స్తుతం ఏపీలో ఇదే జ‌రుగుతోంది.ప్ర‌స్తుతం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ న్యూడ్ వీడియో వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారిన నేప‌థ్యంలో మ‌రోసారి ఓటుకు నోటు కేసుని వైసీపీని నేత‌లు వినిపిస్తున్నారు.

గ‌తంలో కూడా వైసీపీ ఓటుకు నోటు కేసు మాటెత్తుతూ ఆరోప‌ణ‌లు చేశారు.ఇక ఎప్పటికపుడు ఓటుకు నోటు కేసు అలా తెర మీదకు వస్తూనే ఉంటుంది.

తాజాగా గోరంట్ల వ్య‌వ‌హారంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు విషయం మీద టీడీపీ రాద్ధాంతం చేయడాన్ని తప్పు పట్టారు.అది నాలుగు గోడల మధ్య జరిగిన ఒక వ్యవహారంలా కనిపిస్తోంది.

పైగా ఒరిజినల్ వీడియోగా కూడా అగుపించడంలేదు అని ఆయన చెప్ప‌డం విశేషం.ఇక అవతల పక్కన ఎవరు ఉన్నారో కూడా తెలియదు.

అయితే గోరంట్ల ఎంపీ కాబట్టి ప్రజా ప్రతినిధి కాబట్టే దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు అని సజ్జల అన్నారు.ఇక గోరంట్లది అని చెప్పబడుతున్న న్యూడ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్లిందని అక్కడ ఫేక్ దా లేక నిజమైనదా అన్న నివేదిక వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

అప్ప‌టి వ‌ర‌కు తొంద‌ర ఎందుక‌ని మీడియా ముఖంగా టీడీపీని ప్రశ్నించారు.

Telugu Chandra Babu, Revanth Reddy-Political

చంద్ర‌బాబు వాయిస్ కాదా టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో 2015లో అడ్డంగా దొరికిపోయారని.ఈ రోజు వరకూ ఆ వాయిస్ తనది కాదని ఎక్కడా ఆయన చెప్పలేదని కూడా సజ్జల గుర్తు చేస్తున్నారు.వీడియోలో ఆనాటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు.

నోటుకు ఓటుని కొనే ఒప్పందంలో భాగంగా ఓ ఎమ్మెల్యేకు నగదు కూడా ఆఫర్ చేసినట్లుగా అక్కడ కనిపిస్తోంది.బ్రీఫ్డ్ మీ అంటూ బాబు తనదైన స్టైల్ లో మాట్లాడుతున్న ఆడియో ఉందని సజ్జల చెప్పుకొచారు.

నోటు కేసుపై ఇప్పటిదాకా దాని మీద టీడీపీ వాళ్లు ఏమైనా వివరణ ఇచ్చారా అని సజ్జల ఎదురుదాడి చేశారు.అలాగే గోరంట్ల ఓ సాధారణ లోక్ సభ సభ్యుడు.

మరి బాబు అలా కాదు కదా ఆయన ఆనాడు ఏపీకి చీఫ్ మినిష్టర్ గా ఉన్నారు.మరి బాబు చేసిన ఏ పని మీద ఎవరూ ఇప్పటిదాకా పెద్దగా ఎందుకు మాట్లాడ‌లేద‌ని అన్నారు.

అలాగే ముందు బాబు ఓటుకు నోటు కేసు వీడియో సంగతేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.మొత్తానికి గోరంట్ల వీడియోలో తప్పు ఉంద‌ని తెలిస్తే తప్పక శిక్ష ఉంటుందని చెబుతూనే.

ఓటుకు నోటు కేసుని మరోసారి తెర‌పైకి తీసుకు వ‌చ్చారు స‌జ్జ‌ల‌.ఏళ్లు గ‌డిచినా ఆ వీడియో వాయిస్ బాబుదా కాదా.

అని ఎందుకు రుజువు చేయ‌లేద‌ని ప్రశ్నించారు.గోరంట్ల న్యూడ్ వీడియో కేసు ఏముందిలే కానీ బాబుదే చాలా ఇంపార్టెంట్ అన్నట్లుగా సజ్జల మాట్లాడడంతో టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

గోరంట్లకు క్లీన్ చీట్ ఇవ్వడానికే ఈ రకంగా మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శ‌స్తున్నారు.ఇక ఈ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మ‌రి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube