సినిమా ఇండస్ట్రీ లో ఒకరు చేయాల్సిన సినిమాలు ఇంకెవరో చేస్తూ ఉంటారు అది సహజం కానీ ఆ హీరో చేయాల్సిన సినిమా ఈ హీరో చేయడం ఈ హీరో చేయాల్సిన సినిమా ఆ హీరో చేయడం లాంటివి చాలా అరుదు గా జరుగుతాయి.అవి ఏం సినిమాలు ఆ హీరోలు ఎవరనేది మనం తెలుసుకుందాం…
ఎనర్జిటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న రామ్ దేవదాసు సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు ఆ తర్వాత రెడీ కందిరీగ ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు తీసి మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
అయితే రామ్ చేసిన శివమ్ సినిమా స్టోరీ ముందుగా నితిన్ దగ్గరికి వెళ్ళింది ఆ స్టోరీ తనకి నచ్చకపోవడం తో తను ఆ సినిమా చేయకుండా వదిలేసుకున్నాడు.

దాంతో ఆ స్టోరీ రామ్ దగ్గరికి వెళ్ళింది.రామ్ ఆ సినిమా చేసాడు శివమ్ పేరు తో ఆ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయింది … అలాగే నితిన్ చేసిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా స్టోరీ ని కూడా ముందు డైరెక్టర్ రామ్ కి చెప్పాడట ఆ స్టోరీ రామ్ కి నచ్చకపోవడం తో తను ఆ సినిమా చేయలేదు అప్పుడు ఆ స్టోరీ ని నితిన్ కి చెప్పాడు.