స్టార్ హీరోలకు వెన్నులో వణుకు పుట్టించిన అలీ మూవీ ఏదో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లలో అలీ ఒకరు.తెలుగులో 1100కు పైగా సినిమాలలో నటించిన అలీ తన సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులను, అవార్డులను సొంతం చేసుకున్నారు.

 Interesting Facts About Actor Ali Yamaleela Movie Details, Ali, Yamaleela Movie-TeluguStop.com

పేద కుటుంబంలో జన్మించిన అలీ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తిని పెంచుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.బాలనటుడిగా అలీ సక్సెస్ సాధించడంతో ఆ తరువాత కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుని అలీ కెరీర్ ను కొనసాగించారు.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో అలీ ఎక్కువగా నటించారు.పలు సినిమాలలో అలీ హీరోగా నటించడం గమనార్హం.అలీ హీరోగా నటించిన సినిమాలలో యమలీల ఒకటి కాగా సోషియో ఫాంటసీ సినిమాగా యమలీల తెరకెక్కడం గమనార్హం.ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాతో అలీ స్టార్ హీరోలకు వణుకు పుట్టించారు.

మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Telugu Rupees, Ali, Indraja, Mother, Krishna, Yamaleela-Movie

తొలిరోజు యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న యమలీల ఆ తర్వాత పుంజుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సంపాదించుకుంది.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాతో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే చెప్పాలి.

Telugu Rupees, Ali, Indraja, Mother, Krishna, Yamaleela-Movie

సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం గమనార్హం.కృష్ణారెడ్డి కోరిక మేరకు యమలీలలో ఒక పాటలో నటించడానికి కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాకు అటూఇటుగా భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైనా ఆ సినిమాలను ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

కథాబలంతో హిట్టైన ఈ సినిమా ఏకంగా 12 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.ఈ సినిమా బడ్జెట్ కేవలం 75లక్షల రూపాయలు కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube