ఈ వేసవిలో మీ ఇంట్లో ఎన్ని ఏసీలు( AC ) వున్నా అవి ఇంటివరకు మాత్రమే పరిమితం.ఒక్కసారి ఇంట్లోని కాలు బయట పెట్టాక పరిస్థితి ఏమిటి? అసలే ఏప్రిల్ నెల, ఎండలు భగ్గుమంటున్నాయి.ఈ ఎండలను ఈపాటికే చాలామంది వడదెబ్బలు తగిలి చనిపోయిన పరిస్థితి.అయితే మరేం పర్వాలేదు… ఈసారి మీరు బయటకి వెళ్ళినపుడు ఈ గొడుగుని తీసుకెళ్లండి.మీరు అయిపోతారు… చల్లచల్లగా, కమ్మకమ్మగా.ఈ గొడుగు ఆల్ ఇన్ వన్( An all-in-one umbrella ) అని చెప్పుకోక తప్పదు.కేవలం రూ.2,000 వేలకే దిమ్మదిరిగే ఫీచర్లు కలిగిన గొడుగుని సొంతం చేసుకోండి తరుణమే.
సాధారణంగా అవసరాలే ఇలాంటి ఆవిష్కరణలకు తెరలేపుటూ ఉంటాయి.ఓ ఐటీఐ విద్యార్థి తయారు చేసిన గొడుగును చూస్తే మీరు ఇది నిజమే అంటారు.ఈ గొడుగు వేసవిలో కూల్ గా ఉంచడమే కాకుండా పాటలు పాడి అలరిస్తుంది.అంతే కాదండోయ్… ఈ గొడుగుతో ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు.
చీకట్లో వెలుగును కూడా చూపుతుంది.విషయంలోకి వెళితే, మధ్యప్రదేశ్ ( Madhya Pradesh )సాగర్ జిల్లా సిద్ధగువ గ్రామంలో నివాసముంటున్న ఐటీఐ విద్యార్థి ముఖేష్ కుమార్ ( Mukesh Kumar )వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గొడుగును సిద్ధం చేశాడు.
దీనికోసం ముఖేష్ డ్రోన్ కెమెరాలో ఉపయోగించిన నాలుగు మోటార్‌లను, ఫ్యాన్‌ను అమర్చడం జరిగింది.ఇది మీకు సిగ్నల్ అందిన వెంటనే ఆన్ అవుతుంది.ఈ గొడుగులో FM కూడా అమర్చి వారెవ్వా అనిపించాడు.పాటలు వింటూ మనం ఎంచక్కా వాకింగ్ చేసుకోవచ్చు.అలాగే, చీకట్లో వెలుతురు కోసం అందులో మూడు లైట్లు పెట్టడం జరిగింది.ఇది కాకుండా, మీరు ఈ గొడుగుతో మీ మొబైల్‌ను కూడా ఛార్జ్ చేయవచ్చు.
అసలు విషయం ఏమంటే ఈ గొడుగు సోలార్ ప్యానెల్స్‌పై వర్క్ అవుతుంది.కేవలం రూ.2,000తో ఈ గొడుగును అతగాడు సిద్ధం చేశాడు మరి.