ఇంటింటికి డాక్టర్ పథకం జగన్ కి ఓట్లు తెస్తుందా?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి డాక్టర్ పథకం( Intintiki Doctor Scheme ) విజయవంతం అవుతుందా? వైసీపీకి ( YCP ) ఓట్లు తెస్తుందా అన్న చర్చ హాట్ డిబేట్ గా మారింది ….వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అవ్వడానికి ఉపయోగపడిన మొదటి మూడు కారణాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు కూడా ఒకటి అని చెప్పాలి…… వైద్యం ఖరీదుగా మారిపోయిన ఈ రోజుల్లో పేదలకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి దే అని చెప్పాలి ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకాలు పేదల్లో వైయస్సార్ ను దేవుడుగా చేశాయి.

 Intintiki Doctor Scheme Can Get Vote Bank For Jagan Details, Intintiki Doctor Sc-TeluguStop.com

ఒకరకంగా జగన్మోహన్ రెడ్డికి( CM Jagan ) వాళ్ళందరూ సపోర్ట్ చేయడానికి కూడా ఆ కృతజ్ఞతే కారణం అని చెప్పాలి

ఇప్పటికి పల్లెటూర్లలో ఆర్ఎంపీల మీద ఆధారపడే ఆరోగ్య వ్యవస్థ నడుస్తుంది… వారు మామూలు జబ్బులకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పసికట్టగలరే తప్ప పూర్తిస్థాయి నిపుణులు కారు అందువల్ల గ్రామాలలో ఖరీదైన వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్ష లాగే ఉంది ….పేరుకి ఆరోగ్య కేంద్రాలు ఉన్నా కూడా అక్కడ కేవలం జ్వరానికి ఇచ్చే మాత్రలు తప్ప వ్యాది నిర్ధారణ పరీక్షలు చేసే యంత్రాలు గాని పూర్తి స్థాయి వైద్యనిపుణులు గాని అందుబాటులో ఉండటం లేదు… ఇప్పుడు ఆరోగ్య కేంద్రాలను బలపరిచి మండల పిహెచ్సిసి స్థాయిలో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లును ఏర్పాటు వారికి సపోర్టింగ్ స్టాఫ్ ను అందుబాటులోకి తీసుకొస్తామని

Telugu Aarogya Sri, Ap, Cmjagan, Jagan, Moholla Clinic, Ycp, Ycp Vote Bank-Telug

ఒక డాక్టర్ మండల కేంద్రంలో వైద్యం చేస్తే ఒక డాక్టర్ గ్రామాల్లో తిరుగుతూ వారికి కేటాయించిన ప్రజలకు వైద్యం చేస్తారని ప్రభుత్వంచెప్తుంది ….తద్వారా ఒకే డాక్టర్ తనకు కేటాయించిన ప్రజలకు నిరంతరం వైద్యం చేస్తూ ఉంటాడు కాబట్టి వారి శరీర తత్వం మీద వైద్యం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీద వారికి సూటయ్య మందుల మీద అతనికి పూర్తి అవగాహన ఉంటుందని తద్వారా అత్యవసర పరిస్తిలో నిర్ణయం తీసుకోవడం కూడా సులువు అవుతుంది అన్నది ప్రభుత్వాల ఆలోచనగా తెలుస్తుంది.ఒక రకంగా చెప్పాలంటే పల్లెటూర్లలో చిన్నప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను మరొకసారి సమాజానికి పరిచయం చేసే దిశగా వైసిపి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పాలి

Telugu Aarogya Sri, Ap, Cmjagan, Jagan, Moholla Clinic, Ycp, Ycp Vote Bank-Telug

తగినంత మంది డాక్టర్లు లేకపోవడం, సామాగ్రి లేకపోవడం, మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యల్ని అధిగమించి పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఈ పథకం అమలు అయితే మాత్రం ఇది కచ్చితంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుందని ఐదు నుంచి ఆరు శాతం ఓటు బ్యాంకు ను కూడా ప్రభావితం చేయగలుగుతుందని అంచనాలు వస్తున్నాయి.ఉద్యోగులు అధికంగా ఉన్న ఢిల్లీ వంటి నగరంలోనే ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మొహల్లా క్లినిక్ పథకం విజయవంతం అయిందని గ్రామాలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కచ్చితంగా విజయం సాధిస్తుందంటూ రాజకీయ వర్గాల లో విశ్లేషణ వినిపిస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube